బీఆర్ఎస్ లోని కీలక నేతల్లో ఒకరైన మైనంపల్లి హనుమంతరావు పై బహిష్కరణ వేటు తప్పేలాలేదు. ప్రస్తుతం మైనంపల్లి మల్కాజ్ గిరి ఎంఎల్ఏగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏకి కేసీయార్ మళ్ళీ టికెట్ కూడా ఇచ్చారు. అయినా మైనంపల్లి మండిపోతున్నారు. ఎందుకంటే తన కుటుంబానికి రెండు టికెట్లు కావాలని చేసిన డిమాండ్ ను కేసీయార్ పట్టించుకోలేదు. మల్కాజ్ గిరిలో తనకు మెదక్ అసెంబ్లీ టికెట్ తన కొడుక్కు ఇవ్వాలని మైనంపల్లి చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
అయితే మైనంపల్లి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేసీయార్ పట్టించుకోలేదు. దాంతో మండిపోయిన ఎంఎల్ఏ కేసీయార్ తో పాటు మంత్రి హరీష్ రావుపైన నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాంతో కేసీయార్ కు బాగా కోపమొచ్చినా ఎన్నికల సమయం కదాని తమాయించుకున్నారు. దాన్ని మైనంపల్లి అలుసుగా తీసుకున్నారు. అందుకనే మైనంపల్లిని పార్టీలో నుండి బయటకు పంపేయాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. దాంతో మైనంపల్లిపై బహిష్కరణ వేటు తప్పదనే ప్రచారం పెరిగిపోతోంది.
మూడు నాలుగు నియోజకవర్గాల్లో మైనంపల్లి ప్రభావం ఉంటుందనే అనుమానంతోనే ఇంతకాలం కేసీయార్ ఓపిక పట్టారు. అయితే మైనంపల్లిపై బహిష్కరణ వేటు వేసి ఆ స్ధానాన్ని గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రావుతో భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారట. బొంతు ఉప్పల్ టికెట్ అడిగితే కేసీయార్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిగా ఉన్న బొంతును పిలిపించుకుని కేసీయార్ మాట్లాడారట. మైనంపల్లి స్ధానాన్ని బొంతుతో భర్తీ చేయాలని కేసీయార్ అనుకుంటున్నట్లు పార్టీలో బాగా ప్రచారం పెరిగిపోతోంది.
హరీష్ రావు, అమెరికా పర్యటనలో ఉన్న కేటీయార్ కూడా మల్కాజ్ గిరి నియోజకవర్గంలో బొంతు ఎంపికపై కేసీయార్ తో సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. బొంతు గనుక పోటీచేయటం ఫైనల్ అయిపోతే ఇక మైనంపల్లికి నోటీసు ఇవ్వబోతున్నారట. నోటీసుకు మైనంపల్లి ఇచ్చే సమాధానం ఆధారంగా బహిష్కరణ వేటు వేయబోతున్నట్లు టాక్ . ఎలాగై మైనంపల్లిని పార్టీ నుండి తరిమేయాలని అనుకున్నారు. అందుకనే కాస్త ప్రొసీజన్ ఫాలో అయితే బాగుంటందని అనుకున్నారట. సో మైనంపల్లి బహిష్కరణకు రంగం సిద్ధమైనట్లే అనిపిస్తోంది.
This post was last modified on %s = human-readable time difference 11:55 am
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…