రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేసి బీఆర్ఎస్ ఓ మెట్టుపైనే నిల్చుంది. కాంగ్రెస్ ఏమో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది. కానీ ఈ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఏమిటన్నది అర్థం కాకుండా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పట్లో బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించే సూచనలు కనిపించడం లేదు. అయితే దీని వెనుక ఓ ప్రణాళిక ఉందనే ప్రచారం మాత్రం సాగుతోంది. ముందుగానే టికెట్లు ఇచ్చేస్తే.. నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతారని పార్టీ అధిష్ఠానం భావిస్తుందని టాక్. అలా జరిగితే, ముఖ్య నేతలు తమ నియోజకవర్గాలకే పరిమితమైతే పార్టీకి నష్టమని అధిష్టానం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా అభ్యర్థులను ప్రకటించి దెబ్బ తినడం కంటే కూడా బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలను జిల్లాల్లో తిప్పాలన్నది పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది.
ఇప్పుడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. అటు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో బండి సంజయ్ ఉన్నారు. వీళ్లు కాకుండా ఈటల రాజేందర్, డీకే అరుణ, లక్ష్మణ్, రఘునందన్.. ఇలా ఓ పది మంది వరకూ కీలక నేతలున్నారనే చెప్పాలి. ఎన్నికల షెడ్యూల్ వచ్చేకంటే ముందే ఈ నేతలందరినీ జిల్లా పర్యటనలకు పంపించి.. ఆయా స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా బీజేపీ సాగుతోందని సమాచారం. ముందుగానే అభ్యర్థులను ప్రకటించేస్తే వీళ్లు సొంత నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టుకుంటారు. అప్పుడు ఇతర చోట్ల అభ్యర్థులు వెనుకబడటంతో అంతిమంగా పార్టీకి నష్టం కలుగుతోందని బీజేపీ భావిస్తోందని తెలిసింది.
This post was last modified on August 31, 2023 10:39 am
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…