నరేంద్రమోడీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపోయింది. జమ్మూ-కాశ్మీర్ విషయమై కేంద్రప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను రద్దుచేసి ఎంతకాలం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచుకుంటారో చెప్పాలంటు నిలదీసింది. అసలు ఏ అధికారంతో, ఏ కారణంగా రాష్ట్ర హోదాను రద్దుచేశారో చెప్పాలని ప్రశ్నించింది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన కేసును సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసం విచారించింది.
దాదాపు నాలుగేళ్ళ క్రితం జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రానికి మిత్రమే పరిమితమైన ఆర్టికల్ 370 ని మోడీ ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసిందే. పార్లమెంటులో బిల్లుపెట్టి చర్చలు జరిగి తర్వాత ఓటింగ్ ద్వారా బిల్లును చట్టం రూపంలోకి మార్చింది ప్రభుత్వం. అప్పటినుండి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మ-కాశ్మీర్-లడ్దాఖ అనే మూడు ప్రాంతాలుగా విడదీసింది. మూడింటిపైనా కేంద్రప్రభుత్వానికే తాత్కాలిక అధికారాలు ఉండేట్లుగా నిర్ణయించింది. అయితే ఆ ఏర్పాటు ఎంతకాలమో చెప్పలేదు. ఎప్పటికప్పుడు తొందరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని మాత్రమే చెబుతోంది.
ఇదే విషయాన్ని చీఫ్ జస్టిస్ డైరెక్టుగా కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రప్రభుత్వ హోదాను రద్దుచేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. దేనికైనా ఒక పరిమితి ఉటుందని కానీ కేంద్రప్రభుత్వం అన్నీ పరిమితులను దాటేస్తోందని తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. రాష్ట్రహోదాను రద్దుచేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలంటే అందుకు కొన్ని పరిమితులు ఉంటాయని కేంద్రం మరచిపోయినట్లుందని గుర్తుచేసింది. అందుకనే ఎప్పటిలోగా మళ్ళీ రాష్ట్ర హోదాను కల్పిస్తారో చెప్పాలని నిలదీసింది.
చీఫ్ జస్టిస్ ప్రశ్నలకు కేంద్రప్రభుత్వం లాయర్ బాగా ఇబ్బంది పడ్దారు. ఏ ప్రశ్నకైనా ఒకటే సమాధానం. అదేమిటంటే కేంద్రం పరిశీలనలో ఉందని..తొందరలోనే నిర్ణయం తీసుకుంటుందని. దీనిమీద కూడా చీఫ్ జస్టిస్ తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. జమ్మూ-కాశ్మీర్ కు ఎన్నికలు జరుగుతాయా జరగవా చెప్పమని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలు జరిపే ఉద్దేశ్యం కేంద్రానికి ఉందా లేదా స్పష్టంగా చెప్పమని అడ్వకేట్ జనరల్ ను చీఫ్ జస్టిస్ నిలదీశారు. దాంతో రెండు మూడు రోజుల్లో కేంద్రం ఈ అంశంపై ఒక ప్రకటన చేస్తుందని చెప్పి సమస్య నుండి గట్టెక్కారు.