ఎన్ని షోలు ఉన్నా.. మరెంత మంది ఎన్ని విమర్శలు చేసినా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కు ఉండే స్టార్ ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఈ షోతో పాపులర్ అయిన నటుడు వివాదంలో చిక్కుకొని అరెస్టు అయ్యారు. జబర్దస్త్ కమెడియన్ నవ సందీప్ ను హైదరాబాద్ లోని మధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు.
ప్రేమ పేరుతో యువతిని మోసం చేశారన్న ఫిర్యాదుతో అతను చిక్కుల్లో పడ్డారు. ఈ మధ్యనే సదరు యువతి నవ సందీప్ మీద కంప్లైంట్ చేశారు. దీంతో.. విచారణ చేపట్టిన పోలీసుల్ని ప్రాథమిక ఆధారాలతో అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించారు. పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నవ సందీప్ 2018లో ఒక యువతికి ప్రేమ కబుర్లు చెప్పి దగ్గరైనట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఆమెతో తరచూ వాట్సాప్ చాట్ చేస్తుండేవాడు. ఆమెను ఊరి నుంచి హైదరాబాద్ కు రప్పించి.. షేక్ పేటలోని ఒక హాస్టల్ లో నాలుగేళ్లుగా ఉంచారు. ఈ క్రమంలో ఆమెకు బోలెడన్ని మాటలు చెప్పాడని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కోరిక తీర్చుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఆ యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే.. ముఖం చాటేయటంతో తాను మోసపోయినట్లుగా గుర్తించిన సదరు యువతి పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా.. ప్రాథమిక విచారణ జరిపి నవదీప్ ను అరెస్టు చేశారు.
This post was last modified on August 25, 2023 1:40 pm
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం లైలా పై కొనసాగుతున్న వివాదానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడిందని…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకనో గానీ... లండన్ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత తాడేపల్లిలో ఉండేందుకు…
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఆర్ఆర్ఆర్ జరుగుతున్న టైంలో రామ్ చరణ్ తో యువి క్రియేషన్స్ భారీ ప్యాన్…
కమల్ హాసన్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ గా మిగిలిన సినిమాల్లో భారతీయుడు 2 ఒకటి. ఎప్పుడో పాతికేళ్ల…
ఇప్పుడంతా కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మీదే చర్చ జరుగుతోంది. ఏఐ రంగం వైపు దాదాపుగా అన్ని దేశాలు పరుగులు…
గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయి ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే…