తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించేశారు. టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశలు పెట్టుకున్న ఇతర నేతలు నిరాశ పడొద్దని కేసీఆర్ చెప్పారు. పార్టీలో భవిష్యత్లో చాలా అవకాశాలు ఉంటాయని కూడా చెప్పారు. కానీ పార్టీలు మారే నేతలు వింటారా? ఇప్పటికే పార్టీ జంపింగ్లపై ఆ నేతలు ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్కు ఈ సారి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆమె కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని టాక్. ఇప్పటికే ఆమె భర్త, టీజీవో జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాం నాయక్ హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ను కలిసి కాంగ్రెస్లో చేరిపోయారు. ఇప్పుడు రేఖా నాయక్ కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. మరోవైపు ఆసిఫాబాద్, బోథ్, వేములవాడ, స్టేషన్ ఘన్ పూర్, ఉప్పల్, వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ టికెట్లు ఇవ్వలేదు.
దీంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, బోథ్ ఎమ్మెల్యే బాపూరావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య, వైరాలో రాములు నాయక్ లకు కేసీఆర్ ఈ సారి టికెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్ పై ఈ నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇందులో కొంతమంది నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. మరికొందరేమో కేసీఆర్పై నమ్మకంతో పార్టీలోని కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారని టాక్. ఇక టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
This post was last modified on August 22, 2023 2:39 pm
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…