ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఒకే ఒక్క ట్వీట్ మొత్తం ముగ్గురు ప్రత్యర్థులను ఏకి పారేశాడు. ‘బాబు గారు బస్సు ఎక్కాడు.. పప్పు పుత్రుడు రోడ్ ఎక్కాడు.. దత్తపుత్రుడు లారీ ఎక్కాడు.. కానీ …గద్దెనెక్కడం అసాధ్యం!’ అంటూ ముగ్గురికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్లే కనిపించింది.
గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. చంద్రబాబు తో పాటు తన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు ముగ్గురు కూడా ఏపీలో తెగ తిరిగేస్తున్నారు. విడతల వారీగా మరి నియోజకవర్గాలు పంచుకుని మరి కదులుతున్నారు. నారా లోకేష్ పాదయాత్రకు ఇబ్బంది లేకుండా పగలు సమావేశాలు నిర్వహించుకుంటూ..రాత్రులు బస్సు పైన ప్రసంగాలు చేస్తున్నాడు పవన్.
పవన్ తీరు అలా ఉంటే చంద్రబాబు తీరు మరోలా ఉంది..చంద్రబాబు తన సొంత పుత్రుడు తిరిగిన ప్రాంతాలను మరోసారి చూడుతూ..కార్యకర్తలను రెచ్చగొడుతూ రాజకీయ వేడిని మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో అంబటి ముగ్గురికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
కొంత కాలం క్రితం విడుదలైన బ్రో సినిమా లో అంబటి రాంబాబు పై పరోక్షంగా సెటైర్లు వేసిన పవన్ పై అంబటి తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌కు సపోర్టుగా పాదయాత్రలో లోకేష్, చంద్రబాబులు కూడా అంబటిపై విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే.
మొత్తానికి పవన్ లారీ యాత్ర, బాబు బస్సు యాత్ర, లోకేష్ పాదలపై నడిచే పాదయాత్ర వల్ల వారికి ఎటువంటి ప్రయోజనం లేదని అంబటి కామెంట్లు చేశారు.
This post was last modified on August 18, 2023 7:22 pm
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటూ..అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి భార్య షాబానాపై…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ కింగ్…
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇంటిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించిన విషయం ఆదివారం హైదరాబాద్…