దళితులను జగన్ ప్రభుత్వం వేధిస్తోందని… అక్రమ కేసులు పెట్టి భవిష్యత్తు లేకుండా చేస్తుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం నాడు పెదకూరపాడులో ఎస్సీ సామాజికవర్గ నేతలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు.
ఈసందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్ పాలనలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రద్దు చేస్తున్నారు.విదేశీ విద్య పథకం రద్దు చేయడంతో దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ఫీజు రీయింబర్సమెంట్ పథకం అములు కాక సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు.జగన్ పాలనలో కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు. టీడీపీ హయాంలో ఎస్సీలకు సబ్సిడీలో జేసీబీలు, ఇన్నోవాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు లేక కిస్తీ కూడా కట్టలేని పరిస్థితి.
తన నాలుగేళ్ల చిన్నారి తప్పిపోయి మూడేళ్లు అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని లోకేష్ ముందు దళితుడు రమేష్ కన్నీరు పెట్టుకున్నారు. ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోయాయి. పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఇతర రాష్ట్రాలకి వెళ్లి పనులు చేసుకుంటున్నాం. దళితుల్లో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది.
చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదు.ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కల్పించాలి. జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా దళిత ఉద్యోగులను వేధిస్తుంది.ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారిని కూడా తొలగించారు’’ అని నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on August 13, 2023 12:09 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…