వచ్చే ఉగాది నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన, టీడీపీ ఉండవని, ఒకవేళ ఆ రెండు పార్టీలు అప్పటికే ఉంటే తాను గుండు కొట్టించుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఆ పార్టీలకు లేదని, ఎన్నికలప్పుడే వాటికి స్కీములు గుర్తుకు వస్తాయని బొత్స విమర్శలు గుప్పించారు. చెప్పుతో కొడతామని పవన్ వంటి నేతలు చేస్తున్న కామెంట్లపై స్పందించిన బొత్స…చెప్పులు అందరికీ ఉంటాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేత బోండా ఉమా ఘాటుగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో బొత్సతోపాటు ఆయన సోదరులు, కుటుంబ సభ్యులను చిత్తుగా ఓడిస్తామని ఉమ ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాదు, వైసీపీ నుండి బొత్స కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు…మొత్తం 50 మంది తమతో టచ్ లో ఉన్నారని బోండా ఉమ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీపై బొత్సకు అంత నమ్మకం ఉంటే ఉగాది వరకు కాదని ఇప్పుడే ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఓటమి ఖాయమని, ప్రజలు వైసీపీ పాలనతో విసుగెత్తిపోయారని బోండా ఉమ విమర్శించారు. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
అంతకుముందు, పవన్ పై బొత్స సంచలన విమర్శలు చేశారు. జనసేన విధానం ఏమిటి? ఎజెండా ఏమిటి అనే ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ వద్ద సమాధానం లేదని బొత్స విమర్శలు గుప్పించారు. పార్టీ పెట్టి 15 ఏళ్లయినా సంస్థాగత నిర్మాణంపై ఆయనకు ఏమాత్రం అవగాహన లేదని బొత్స అన్నారు. వాలంటీర్లపై కూడా పవన్ మాట మార్చారని, అసలు పవన్ స్టాండ్ ఏమిటో చెప్పాలని బొత్స నిలదీశారు. పవన్ చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, రాజకీయాలు అంటేనే అసహ్యం వేస్తోందని బొత్స వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణకు బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు.
This post was last modified on August 13, 2023 12:11 am
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…