Political News

యూత్ విషయంలో ప్రభుత్వం ఫెయిలైందా ?

యూత్ ను టాకిల్ చేయటంలో తెలంగాణా ప్రభుత్వం విఫలమైందనే అనిపిస్తోంది. యూత్ కు మొదటగా కావాల్సింది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఈ రెండు క్రియేట్ చేయలేకపోయినపుడు 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు కనీసం నిరుద్యోగ భృతి. ఉద్యోగాలను భర్తీ చేయటంలోనే కాదు పరీక్షలు నిర్వహించటంతోపాటు చివరకు నిరుద్యోగ భృతి కల్పించటంలో కూడా ప్రభుత్వం ఫెయిలైన విషయం అర్ధమవుతోంది. ఉద్యోగాల భర్తీ కోసమే ఏర్పాటుచేసిన టీఎస్సీఎస్సీని  నూరుశాతం వివాదాలు చుట్టుముడుతున్నాయి.

ఉద్యోగాలు భర్తీ చేయకుండా చాలా కాలం తాత్సారంచేసిన కేసీయార్ ప్రభుత్వం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్లాన్ చేసింది. దీనికి అనుగుణంగానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీచేసింది. ఎప్పుడైతే నోటిఫికేషన్ల ద్వారా పరీక్షల నిర్వహణకు రెడీ అయ్యిందో వెంటనే ప్రశ్నపత్రాల లీకేజీలు మొదలయ్యాయి. దీంతో పరీక్షల నిర్వహణ, అభ్యర్ధుల ఎంపిక, ఉద్యోగాల భర్తీ పెద్ద ప్రహసనంగా మారిపోయింది.

కోర్టుల్లో కేసులతో సతమతమవుతున్న సమయంలో టీఎస్సీపీఎస్సీని ప్రక్షాళనచేసింది. కొత్త బోర్డు ఏమిచేసిందంటే నిర్వహించబోయే పరీక్షలన్నింటినీ వెంటవెంటనే నిర్వహించేస్తోంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయాన్ని కూడా అభ్యర్ధులకు ఇవ్వకపోవటంతో వాళ్ళంతా మండిపోయారు. దాంతో టీఎస్పీఎస్సీపై దండయాత్రచేశారు. గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వందలాదిమంది విద్యార్ధులు, పరీక్షలు రాయబోతున్న వాళ్ళు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద నానా గోలచేశారు. ఇప్పటికే ప్రభుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగాలు రానివాళ్ళు, విద్యార్ధులంతా మండిపోతున్నారు.

అప్పుడెప్పుడో ఇచ్చిన హామీ ప్రకారం కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటంలేదు. దాంతో యూత్ లో అత్యధికం కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారని మంత్రులు, ఎంఎల్ఏల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రేపు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినపుడు ఎలాంటి పరిస్ధితులు ఉంటాయో అనే ఆందోళన పెరిగిపోతోంది. యూత్ ఫ్యాక్టర్ ను ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకుంటోంది. గ్రూప్ 2 పరీక్షల తేదీలను రీ షెడ్యూల్ చేయటానికి ప్రభుత్వం ప్రిస్టేజ్ గా పోతోంది. చేయకపోతే నిరుద్యోగులు, పరీక్షలు రాసేవాళ్ళు ఊరుకోవటంలేదు. రీషెడ్యూల్ చేస్తే ప్రభుత్వం అవమానంగా భావిస్తోంది. మరీ సమస్య ఎలా పరిష్కారమవుతుందో చూడాల్సిందే.

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబు ఐడియా: డ్వాక్రా పురుష గ్రూపులు!

రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అన‌గానే మ‌హిళ‌లే గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వ‌యం స‌హాయ‌క మ‌హిళా సంఘాలు!…

39 minutes ago

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

8 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

8 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

9 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

9 hours ago