రాజకీయాల్లో నాయకుల వేడి.. దూకుడు కూడా.. ఒక్కొక్కసారి వెనక్కి తగ్గించుకోవాల్సిందే. ఎంత నేర్చి నా.. ఎంతవారలైనా.. అన్నట్టుగా రాజకీయాల్లో ఎంత ఉద్ధండులైనా.. సమయానికి అనుగుణంగా వ్యవ హరించాల్సిన పరిస్థితి తప్పదు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ ఇదే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావించిన మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణకు చుక్కెదురైంది.
ఆయనకు టికెట్ ఇవ్వలేమని చెప్పకుండానే.. వచ్చే ఎన్నికల తర్వాత.. పార్టీ గెలిస్తే.. గౌరవ ప్రదమైన పోస్టు ఇస్తామని చంద్రబాబు వర్తమానం పంపారు. అంతేకాదు.. ఇక్కడ పార్టీ ఇంచార్జ్‌గా మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణకు పగ్గాలు అప్పగించారు. నిజానికి కోడెల కుటుంబానికి అటు నరసారావు పేట, ఇటు సత్తెనపల్లిలోనూ బలమైన వర్గం ఉంది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి కాకపోయినా.. నరసారావు పేట టికెట్ కావాలని.. వారు కోరుకున్నారు.
కానీ, ఏదీ ఇవ్వకుండానే.. చంద్రబాబు ఆయనకు పార్టీ అధికారంలోకి వచ్చాక కీలకమైన నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పారు. అంటే.. దీనిని బట్టి కోడెల కుటుంబానికి ఈ దఫా ఎన్నికల్లో ప్రాధాన్యం లేకుం డా పోయింది. ముందు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శివరామకృష్ణ కొద్ది రోజుల పాటు కొంత అసహనం ప్రకటించారు. ప్రదర్శించారు కూడా. అయితే.. ఏమైందో ఏమో.. పార్టీ కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని తెలిపారు. ఇక, ఆయన సర్దుకుపోయారనే చర్చ తెరమీదికి వచ్చింది.
తాజాగా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల మీదుగా సాగింది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికి.. ఆయనతో కలిసి అడుగులు వేశారు. ఈ కార్యక్రమంలో కన్నా వెంటే కోడెల వారసుడు కూడా పాల్గొన్నారు. ఇద్దరూ కూడా కలిసిమెలిసి.. పాదయాత్రంలో అడుగులు వేశారు. ఈ పరిణామంతో నిన్న మొన్నటి వరకు ఉన్న సందేహాలు పటాపంచలు అయ్యాయని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 11, 2023 10:54 pm
తాజాగా మరో రాజ్యసభ సీటుకు సంబంధించి ఎన్నికలకు రంగం రెడీ అయింది. వైసీపీ నాయకుడు, కీలక నేతల వేణుంబాకం విజయ…
ఇటీవలే విడుదలైన రవితేజ మాస్ జాతర పాటలో స్వర్గీయ చక్రి గొంతు విని సంగీత ప్రియులు ఆశ్చర్యపోయారు. అభిమానులు భావోద్వేగానికి…
తెలంగాణ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును…
ఏపీ సీఎం చంద్రబాబు విషయం గురించి చెబుతూ… మంత్రి నారాయణ ఒక మాట చెప్పారు. "మనం వచ్చే రెండు మూడేళ్ల…
అభిమానులు భయపడినట్టే జరిగేలా ఉంది. మే 9 హరిహర వీరమల్లు వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్…