Political News

వైజాగ్ లో మొదలైన టెన్షన్

రాయలసీమలో చంద్రబాబునాయుడు పర్యటనలో తలెత్తిన టెన్షన్ ముగియకముందే ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టెన్షన్ మొదలైంది. ఈరోజు సాయంత్రం నుండి పవన్ వైజాగ్ తో వారాహియాత్రను మొదలుపెడుతున్నారు. 10 రోజుల వారాహియాత్రను విశాఖపట్నం సభతో పవన్ మొదలుపెడుతున్నారు. మొదటి సభే వైజాగ్ సిటీలోని జగదాంబ సెంటర్ తో మొదలుపెడుతున్నారు. మామూలుగా అయితే సిటీలోని జగదాంబ సెంటర్ లో సభను ఎవరు పెట్టరు, సభను పెట్టాలని అనుకున్నా పోలీసులు అనుమతించరు.

కారణం ఏమిటంటే వైజాగ్ సిటీకి జగదాంబ సెంటర్ అన్నది అత్యంత కీలకమైన, రద్దీ సెంటర్ అన్నది అందరికీ తెలిసిందే. అంతటి రద్దీ సెంటర్లో రాజకీయ సభలకు, కార్యక్రమాలకు అనుమతిస్తే మొత్తం సిటీ ట్రాఫిక్ అంతా ప్యారలైజ్ అయిపోతుంది. అందుకనే సిటీలో ఏ పార్టీకి పోలీసులు అనుమతి ఇవ్వరు. అలాంటిది జనసేన పర్మిషన్ అడగటం, పోలీసులు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముందుగానే పోలీసులు ఎంత ట్రాఫిక్ డైవర్షన్ పెట్టినా ట్రాఫిక్ ఇబ్బందులైతే జనాలకు తప్పేట్లులేదు.

పైగా పవన్ ప్రోగ్రామ్ అనుకున్నది అనుకున్నట్లు మొదలుకాదు. ఇప్పటివరకు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కనీసం రెండుమూడు గంటలు ఆలస్యంగానే మొదలవుతోంది. అంటే మూడు గంటలు ఆల్యంగా మొదలైందంటే అన్నిగంటలు ట్రాఫిక్ ఆగిపోయినట్లే లెక్క. సరే ట్రాఫిక్ సమస్యలను పక్కనపెట్టేస్తే నిబంబధనలను ఉల్లంఘించకూడదని పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. పోలీసులు విధించన ఆంక్షలను పాటించటమే అసలైన సమస్య. పవన్ను చూడటానికి వచ్చేవాళ్ళు, పవన్ సభల్లో పాల్గొనేది మామూలు జనాలు కాదు.

పవన్ అభిమానులే ఎక్కువగా జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అభిమానులను కంట్రోల్ చేయటం చాలా కష్టం. పదులసంఖ్యలో అయితే కంట్రోల్ చేయచ్చు కానీ వేలసంఖ్యలో వచ్చే అభిమానులను కంట్రోల్ చేయటం పోలీసులకు తలకుమించిన పననే చెప్పాలి. ఎక్కడో ఎవరో నిబంధనలను ఉల్లంఘిస్తారు దాంతో పోలీసులక మండుతుంది. దాంతో ప్రోగ్రామ్ అంతా గబ్బుపట్టిపోవటం ఖాయం. నిబంధనలను ఉల్లంఘించాలని, ప్రతి ఒక్కళ్ళు నిబంధనలకు కట్టుబడి ఉండాలని పార్టీ తరపున పవన్ పదేపదే ట్విట్టర్లో అప్పీల్ చేశారు. ట్విట్టర్లో అప్పీల్ చేయటం ఒకేనే కానీ డైరెక్టుగా పవన్ కనిపిస్తే అభిమానులకు నియమాలు, నిబంధనలు ఏవీ గుర్తుండవు. అందుకనే పవన్ టూర్ సందర్భంగా టెన్షన్ పెరిగిపోతోంది. 

This post was last modified on August 10, 2023 11:01 am

Share

Recent Posts

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

17 minutes ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

2 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

2 hours ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

3 hours ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

3 hours ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

7 hours ago