జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది. ఇది సినిమాల పరంగా కాదు. రాజకీయ పరంగానే ఆయనకు దన్నుగా నిలిచేవారి సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. తాజాగా మాటల మాంత్రికుడు.. ఫైర్ కామెంట్ల ఫ్యాక్టరీగా పేరొందిన పరుచూరి గోపాల కృష్ణ జనసేనానికి మద్దతుగా నిలిచారు. పవన్‌ను దెబ్బతిన్న పులిగా పోల్చారు. ఆయన దెబ్బతిన్న పులికి ఎంత పౌరుషం ఉంటుందో అంతే పౌరుషంతో ప్రజల్లోకి వస్తున్నారని.. పవన్ కోరుకున్నది (అధికారం) దక్కి తీరుతుందని గోపాల కృష్ణ వ్యాఖ్యానించారు.
సమాజం మారాలంటే అప్పుడప్పుడు అధికారం చేతులు మారుతుండాలి అని పరుచూరి అన్నారు. అంతేకాదు.. ఏపీ ప్రభుత్వాన్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ.. ఒకరి చేతుల్లోనే అధికారం ఉండకూడదని చెప్పుకొచ్చారు. అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మార్పు కోసమే గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేశారని, అయితే, ఆయన రెండు చోట్లా ఓడిపోయారని.. రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఇలానే జరుగుతుందని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు. ఆ ఫలితాలతో నిరాశ చెందకుండా దెబ్బతిన్న పులిలా మళ్లీ వస్తున్నాడని పవన్‌ను ఉద్దేశించి చెప్పారు.
“ఎన్నికల్లో ఓటింగ్ అనేది ఒక పెద్ద రాజకీయ తంత్రం. పాలిటిక్స్‌లో ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి. అలాగే సమాజం గురించి రాజకీయ నేతలు చెబితే వినేవారికంటే.. సినిమా నటుడు చెబితే వినేవాళ్లు ఎక్కువ మంది ఉంటారు. పవన్ బాగుండాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని” అని పరుచూరి గోపాల కృష్ణ చెప్పారు. రాజకీయాల్లో పవన్ బిజీ అయిపోవాలని.. ఆయన కోరుకున్నది కూడా జరగాలని గోపాల కృష్ణ చెప్పారు.
అయితే, పవన్ కల్యాణ్‌ను సినిమాలు చేయడం ఆపేయవద్దని ఎప్పటికీ కొనసాగించాలని పరుచూరి కోరారు. సమయం లేకపోతే గతంలో అధికారంలో ఉండి కూడా అన్నగారు ఎన్టీఆర్ సినిమాల్లో నటించినట్టుగా అప్పుడప్పుడైనా పవన్ సినిమాల్లో కనిపించాలని సూచించారు. అలాగే పవన్ కోరుకున్నది ఆయనకు దక్కాలని పరుచూరి చెప్పారు.
This post was last modified on August 10, 2023 10:47 am
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…