Political News

కేటీఆర్ నోట‌.. గెలుపోట‌ముల మాట‌

కేటీఆర్‌.. తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా కేసీఆర్ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ ఇటు పార్టీలో అటు ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా ఎన్నిక‌ల కోసం పార్టీని సిద్ధం చేస్తున్నారు. వ‌రుస‌గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి చ‌రిష్మా ఉన్న కేటీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం సులువేన‌న్న అభిప్రాయాలున్నాయి. కానీ తాజాగా ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేది బీఆర్ఎస్ అని.. కేంద్రంలోనూ సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డి, అందులో త‌మ పార్టీ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ఇటీవ‌ల కేటీఆర్ చెబుతున్నారు. పార్టీ విజ‌యంపై అంత ధీమాతో ఉన్న ఆయ‌న‌.. తాజాగా రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మంలో చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ద‌య ఉంటే గెలుస్తాన‌ని, లేకుంటే ఇంట్లో కూర్చుంటాన‌ని ఆయ‌న అన్నారు.

పార్టీలో కీల‌క నేత అయిన కేటీఆర్‌కు తిరుగులేద‌ని అంటుంటారు. సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న కంచుకోట అని చెబుతారు. అలాంటిది వ‌చ్చే ఎన్నిక‌ల‌పై కేటీఆర్ వ్యాఖ్య‌ల వెనుక ఆంత‌ర్యం ఏమిటో అర్థం కావ‌డం లేద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇటీవ‌ల ఓ స‌ర్వే ప్ర‌కారం సిరిసిల్లాలో కేటీఆర్ గెలుస్తారు కానీ మెజారిటీ మాత్రం త‌గ్గుతుంద‌ని వెల్ల‌డైంద‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ చూర‌గొనేందుకు కేటీఆర్ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారా? అన్న అనుమానాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

This post was last modified on August 9, 2023 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లాప్ హీరోయిన్ ఫేవరెట్ అయిపోయింది

దేనికైనా టైం రావాలని పెద్దలు ఊరికే అనలేదు. కాకపోతే ఆ సమయం వచ్చేవరకు ఓపికగా ఎదురు చూడాలి. అది ఉండబట్టే…

29 minutes ago

మోడీ తెలంగాణ‌కు ఇచ్చింది రెండు ఉద్యోగాలే: రేవంత్

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై సీఎంరేవంత్ రెడ్డి ఫైర‌య్యారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మంచిర్యాల‌లో నిర్వ‌హించిన…

1 hour ago

ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఉగ్ర ముప్పు?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతున్న వేళ, ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు కొత్త ముప్పును గుర్తించాయి. పాకిస్థానీ టెర్రరిస్టు…

1 hour ago

‘ఫైబర్ నెట్’ జీవీ రెడ్డి జంట రాజీనామాలు!

అధికార కూటమిలోని కీలక భాగస్వామి టీడీపీకి ఇది ఊహించని పరిణామమేనని చెప్పాలి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే…

2 hours ago

టాలీవుడ్ సినిమాలతో అనిరుధ్ బిజీ బిజీ

నిన్నటి దాకా దొరకడమే మహా కష్టం, ఏదైనా వర్క్ చేయించుకోవడం అంత కన్నా సవాల్ అనే రీతిలో ఉన్న అనిరుధ్…

2 hours ago

మ‌హిళ‌లకు పండ‌గే.. ఆ రెండు ప‌థ‌కాలు ఖాయం!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల ప‌రంపర మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చింది. ఆయా హామీల్లో కీల‌క‌మైన వాటిని…

3 hours ago