Political News

“నా మీద న‌మ్మ‌కం లేదా..” మ‌హిళ‌కు వైసీపీ ఎమ్మెల్యే ఫోన్‌

క‌ర్నూలు జిల్లాకు చెందిన మైనారిటీ నాయ‌కుడు, వైసీపీ ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ వ్య‌వ‌హారం.. సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న ఓ మ‌హిళ‌తో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఆడియోలో ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ ఓ మ‌హిళ‌తో మాట్లాడుతూ.. ‘‘నా మీద నీకు నమ్మకం లేదా? బిజినెస్‌లో షేర్‌ ఇస్తాం కదా! ఎంత పెట్టుకోగలవు’’ అని అన్నారు. దీనికి స‌ద‌రు మ‌హిళ ‘‘3 వరకు పెట్టుకుంటాను. మీ ఇంటికి వచ్చి నేరుగా మీతోనే మాట్లాడుతాను’’ అంటూ వ్యాఖ్యానించింది.

ఇది వాట్సాప్ కాల్ కావ‌డం.. సంభాష‌ణ‌లు బ‌య‌ట‌కు రావ‌డంతో ఎమ్మెల్యేపై విప‌క్షాలు విమ‌ర్శ‌లుగుప్పిస్తున్నాయి. అంతేకాదు.. ఈ వ్యాఖ్య‌ల‌తో పాటు మరికొన్ని సంభాషణలు కూడా వినిపించీ వినిపించ‌న‌ట్టుగా ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యేతో మాట్లాడిన మహిళ ఎవరు? ఆ డీల్‌ ఏంటి? అనేదానిపై రాజకీయ వర్గాల్లోను, విప‌క్ష నేత‌ల మ‌ధ్య చర్చగా మారింది. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాలో ఈ ఆడియోపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్ నేరుగా స్పందించారు.

నాపై ప్రతిపక్ష పార్టీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఓ మహిళతో మాట్లాడింది వాస్తవమే. అందులో అసభ్యకరంగా ఏముంది? అభ్యంత‌ర‌క‌రంగా నేనేమీ మాట్లాడ‌లేదే! అయినా అది రెండేళ్ల క్రితం నాటి ఆడియో. ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశ పూర్వ‌కంగా న‌న్ను ప‌ల‌చ‌న చేసేందుకు ఇప్పుడు ఆ ఆడియోను తెరపైకి తెచ్చాయి. ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఇదంతా చేస్తున్నారు అన్నారు.

దీంతో మీడియా మిత్రులు కొంద‌రు అస‌లు ఆ మ‌హిళ ఎవ‌రు? అని ప్ర‌శ్నించారు. దీనికి హ‌ఫీజ్‌ఖాన్ రియాక్ట్ అవుతూ.. ఎమ్మెల్యే వద్దకు ఎన్నో సమస్యలతో ఎంతో మంది వస్తుంటారు. వారితో మాట్లాడటం తప్పు ఎలా అవుతుంది? సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆడియోపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను కోరాను. ఆ మహిళ ఎవరు, ఇద్దరి మధ్య ఏం ఒప్పందం జరిగిందనే విషయాలు విచార‌ణ‌లో తేలుతాయి. అయినా ఆ మహిళ ఎవరో ఆడియో లీక్‌ చేసిన వారినే అడగాలి అని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 30, 2023 10:04 pm

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

38 minutes ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

2 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

9 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

10 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

10 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

11 hours ago