Political News

బండి ప‌రుగులు.. ఇక ఏపీలోనా?

తెలంగాణ‌లో బీజేపీకి జోష్ పెంచిన నేత‌గా బండి సంజ‌య్‌ను చెప్పుకోవ‌చ్చు. 2020 మార్చిలో బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించినప్ప‌టి నుంచి త‌న మాట‌ల్లో, చేత‌ల్లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ పార్టీని ప‌రుగులు పెట్టించారు. రాష్ట్రంలో పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాలు చేశారు. గ్రామ స్థాయి నుంచి క్యాడ‌ర్‌ను బ‌లోపేతం చేయ‌డంలో కాస్త స‌ఫ‌ల‌మ‌య్యారు. కానీ ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నిక‌ల నేప‌థ్యంలో బండి సంజ‌య్ ఉంటే ప‌ని కాద‌ని అనుకున్న బీజేపీ అధిష్ఠానం.. ఆయ‌న స్థానంలో కిష‌న్‌రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజయ్‌ను తప్పించ‌డం ఊహించ‌ని ప‌రిణామ‌మే. దీంతో ఆయ‌న వ‌ర్గం తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ప్ర‌ధాని స‌భ‌లోనూ, కిష‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంలో సంజ‌య్‌కు గొప్ప స్పంద‌న వ‌చ్చింది. దీంతో సంజ‌య్‌ను తాజాగా బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించి.. న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు అధిష్ఠానం పూనుకుంది. దీంతో ఆయ‌న వ‌ర్గం ఏ మేర‌కు సంతృప్తి చెందుతుంద‌నే విష‌యం ప‌క్క‌న‌పెడితే.. బండి సంజ‌య్ మాత్రం పైకి సానుకూలంగానే స్పందించారు.

ఇక పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బండి సంజ‌య్ ఓ రాష్ట్రంలో పార్టీ ఇంఛార్జీగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులుగా రాష్ట్రాల్లో పార్టీ బాధ్య‌త‌ల‌ను అధిష్ఠానం అప్ప‌గిస్తోంది. ఈ క్ర‌మంలో బండి సంజ‌య్‌ను ఏ రాష్ట్రానికి ఇంఛార్జీగా నియ‌మిస్తారోన‌నే ఆస‌క్తి క‌లుగుతోంది. అయితే ఏపీ బాధ్య‌త‌లు చూసే సునీల్ దేవ‌ధ‌ర్‌ను కార్య‌ద‌ర్శి ప‌ద‌వి నుంచి పార్టీ త‌ప్పించింది. దీంతో ఏపీ బాధ్య‌త‌ల‌ను ఆయ‌న కోల్పోనున్నారు. ఇప్పుడు సునీల్ స్థానంలో బండి సంజ‌య్‌ను ఏపీకి ఇంఛార్జీగా నియ‌మిస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అదే జ‌రిగితే.. త‌న వ్యూహాలు, ప్ర‌ణాళిక‌ల‌తో ఏపీలోనూ బండి దూకుడుతో పార్టీలో జోష్ పెంచే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

This post was last modified on July 30, 2023 9:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

4 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

5 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

5 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

6 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

8 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

8 hours ago