ఏపీలో గత కొద్దిరోజులగా చర్చనీయాంశంగా మారిన హోటల్ స్వర్ణ ప్యాలస్‌లో జరిగిన ప్రమాదంపై ఘటనలో ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసులో ముగ్గురు ఆసుపత్రి సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేయగా హాస్పిటల్ ఎండీ రమేష్ బాబు అదృశ్యమయ్యారు. ఆయన కోసం కొన్ని ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చ జరుగుతోంది. తాజా ఘటనలో తెలుగుదేశం పార్టీ ఎంట్రీ ఇచ్చి కుల సమీకరణలు, ఇతర అంశాలపై స్పందించింది.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్లు చేశారు. స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమనే ప్రభుత్వ వాదన సరైంది కాదని అన్నారు. స్వర్ణప్యాలెస్‌లో కోవిడ్ కేంద్రం నిర్వహణకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే అక్కడ జరిగిన ప్రమాదానికి కారణమని ఆరోపించారు. క్వారంటైన్ సెంటర్‌గా ఉన్న స్వర్ణప్యాలెస్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చింది ప్రభుత్వం కాదా? అని ఆయన ప్రశ్నించారు. కోవిడ్ సెంటర్ కి అనుమతులు వచ్చినప్పుడు అందులో సౌకర్యాలు ఉన్నాయో లేదో ప్రభుత్వానికి తెలియదా ? అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, తప్పులను కప్పిపుచ్చు కోవడానికే వైసీపీ నేతలు కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ మండిపడ్డారు. ఒక కులం పేరు చెప్పి, ప్రభుత్వం ఎందుకు రాజకీయాలు చేస్తోందని, తల్లికి బిడ్డకు మధ్య కూడా కులం పేరుతో అభిప్రాయబేధాలు సృష్టించే నీచస్థాయికి ప్రభుత్వం దిగజారిందని ప్రశ్నించారు. అనేక పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే, అందుకు కారకులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించిన అయన స్వర్ణప్యాలెస్ లో జరిగిన ప్రమాదానికి నిజంగా ఎవరు కారకులో వారిపై చర్యలు తీసుకోండని అన్నారు.
పూర్తి స్థాయి విచారణ జరపకుండా స్వర్ణప్యాలెస్ ఘటనకు రమేశ్ ను ఎలా బాధ్యులను చేస్తారు? అని టీడీపీ నేత ప్రశ్నించారు. పూర్తి ఆధారాలున్నాకే వైద్యులను అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు భయభ్రాంతులతో ప్రజలకు వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నారని వాపోయారు.
This post was last modified on August 17, 2020 10:07 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…