ఏపీ సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. “ఒకళ్లను పెళ్లి చేసుకుని.. మరొకరితో సంసారం చేసేవాడు” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యక్తిగత జీవితంతోపాటు. ఆయన సంసారంపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా వెంకటగిరి నియోజకవర్గంలో పర్యటించిన జగన్.. పవన్ కళ్యాణ్ కేంద్రంగా నిప్పులు చెరిగారు.
“పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం దత్తపుత్రుడి(పవన్ కల్యాణ్) క్యారెక్టర్. అలాంటి వ్యక్తా వలంటీర్ల గురించి మాట్లాడేది. ఒకరిని వివాహం చేసుకుని.. మరొకరితో అక్రమ సంబంధంపెట్టుకునే వ్యక్తా వలంటీర్ల వ్యక్తిత్వం మాట్లాడేది. అసలు వలంటీర్లను తప్పుబట్టింది.. పదేళ్లుగా చంద్రబాబుకు వలంటీర్‌గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్”
వలంటీర్ల క్యారెక్టర్లను దత్తపుత్రుడు తప్పుబట్టాడని, వాళ్లను అవమానించాడని సీఎం జగన్ అన్నారు. మన వలంటీర్లు అమ్మాయిల్ని లోబర్చుకున్నారా?.. అమ్మాయిల్ని లోబర్చుకోవడం ఏంటో పవన్ కు తెలిసినంతగా ఈ రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో వాళ్ల నుంచి సేవలు అందుకుంటున్న కోట్ల మందికి తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వలంటీర్లు గడపగడపకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఆయా పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందించడం ద్వారా వలంటీర్లు చరిత్ర సృష్టించారని తెలిపారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం మంచి చేసిందన్నారు. మేనిఫెస్టోలో 90 శాతం హామీలను నెరవేర్చిన చరిత్ర మనది. రానున్న రోజుల్లో మీ బిడ్డ గురించి.. మీ బిడ్డ ప్రభుత్వం గురించి చెడుగా మాట్లాడతారు. అబద్ధాలను, మోసం చేసేవారిని నమ్మకండి. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగిందా ? లేదా? అనేది చూడండి
అని జగన్ పిలుపునిచ్చారు.
This post was last modified on July 21, 2023 2:44 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…