వైసీపీ అధినేత, సీఎం జగన్.. మరో 9 నెలలు లేదా.. ముందస్తు ఎన్నికలు వస్తే..అ ప్పటి వరకు సీఎంగా ఉంటారనేది ఖాయం. ఈ విషయంలో ఢోకా లేదు. ఇక, భవిష్యత్తు అంటారా.. అది ప్రజల చేతుల్లో ఉంది. ఎవరైనా ఇదే చెబుతారు.
అయితే.. సీఎం జగన్ అంటే వల్లమాలిన ప్రేమ కురిపించే ప్రభుత్వ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత కాకర్ల వెంకట్రామిరెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. ఈయన తరచుగా సీఎం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. ఆయన ఎక్కడా రాజీ పడరు. ఈ విషయంలో గతంలో ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇక, తాజాగా సీఎం జగన్‌ను మరోసారి ఆకాశానికి ఎత్తేశారు. సీఎం జగన్ స్వయంగా ఏం చెబుతున్నారంటే.. మరో 30 ఏళ్లపాటు(దీనిలో ఐదేళ్లు అయిపోయింది) తానే సీఎం గా ఉంటానని.. వైసీపీనే ఏపీలో ప్రభుత్వం నడుపుతుందని చెబుతున్నారు. సరే.. ఇదెలా ఉన్నా..ఉద్యోగం సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి ఉద్యోగుల సమస్యలను పక్కన పెట్టి.. సీఎం జగన్‌కు భజన చేయడం ప్రారంభించారు. ఆయన ఏకంగా.. సీఎం వృద్ధుడు అయిపోయేంతవరకు సీఎంగానే ఉంటారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. జగన్ కర్ర పట్టుకునినడుస్తూ.. నడుం వంగిపోయిన దశలో ఇక, చిరాకు పుట్టి.. అసహ్యం వేసి.. వదిలేస్తేనే సీఎం సీటు ఖాళీ అవుతుంది
అని చెప్పుకొచ్చారు.
This post was last modified on July 16, 2023 8:13 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…