తెలంగాణలో మార్పుల విషయం ఏమోగానీ బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తప్పించే విషయంలో అగ్రనేతల ఆలోచనలు మారిపోయాయా ? బండిని అధ్యక్షుడిగానే కంటిన్యు చేయాలని అనుకుంటున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. చివరి నిముషంలో మారిన అగ్రనేతల ఆలోచనలకు కారణం ఏమిటి ? ఏమిటంటే బండికి మద్దతుగా ఆరెస్సెస్ చక్రం అడ్డేసిందట. బీజేపీకి మూలమే ఆరెస్సెస్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
చాలా విషయాల్లో బీజేపీని వెనకుండి నడిపిస్తున్నది ఆరెస్సెస్సే అన్న విషయం చాలామందికి తెలుసు. పైకి ఎక్కడా ఆరెస్సెస్ ప్రమేయం కనబడదు కానీ తెరవెనుక మాత్రం బలమైన పాత్రే ఉంటుంది. నరేంద్రమోడీ నియామకం కూడా స్వయంగా ఆరెస్సెస్ కారణంగానే జరిగిందనే విషయమై ప్రచారం అందరికీ తెలిసిందే. ఒకదశలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్ ను తప్పిస్తారనే ప్రచారం జరిగినా చివరకు ఏమీకాలేదు.
ఇపుడు తెలంగాణా విషయంలో కూడా అలాగే జరుగుతోందని సమాచారం. బండి బ్యాగ్రౌండ్ కూడా ఆరెస్సెస్సే అని అందరికీ తెలుసు. ఒక్క బండనే కాదు మొదటి నుంచి బీజేపీలోనే ఎదిగిన చాలామంది సీనియర్ నేతల బ్యాగ్రౌండ్ ఆరెస్సెస్సే. కాబట్టి మాతృసంస్థ చెబితే కాదనేవాళ్ళుంటారు. అందుకనే బండిని తప్పించకుండా కంటిన్యు అవ్వాలని అగ్రనేతలు అనుకున్నారట. బండి మీద కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరెస్సెస్ ముఖ్యనేతలు ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలకు బ్రీఫింగ్ ఇచ్చారట. అదికూడా బీజేపీలో ఈమధ్యనే చేరిన నేతలతోనే బండికి సమస్యలు మొదలైనట్లు గట్టిగా చెప్పారట.
నిజానికి ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళని బీజేపీలో చేర్చుకోరు. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీ విధానాలన్నీ మారిపోతున్నాయి. బలమైన నేతలుగా అనుకున్న వాళ్ళని ఇతర పార్టీల్లో నుండి లాగేసుకుంటున్నారు. అవసరం కారణంగా లాక్కుంటున్నారు కాబట్టి కీలకపదవులిచ్చి నెత్తిన పెట్టుకుంటున్నారు. దాంతో పాత నేతలకు, కొత్త నేతలకు మధ్య గొడవ లై పోతున్నాయి. ఇది కాస్త ఆధిపత్యానికి దారితీసి పార్టీలో సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇపుడు బండికి మద్దతుగా ఆరెస్సస్ గట్టిగా నిలబడటానికి ఇలాంటి కారణాలే ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 4, 2023 1:15 pm
పుష్ప 1లో సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన…
కనివిని ఎరుగని జనసందోహం మధ్య బీహార్ లో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టరయ్యాక పుష్ప 2 తాజాగా చెన్నైలో జరిపిన…
టాలీవుడ్ లో అత్యంత బిజీగా టాప్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే ముందు గుర్తొచ్చే పేరు రష్మిక…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెద్దాలో జరుగుతోంది. ఎడారి దేశంలో జరుగుతోన్న ఐపీఎల్ 18వ…
పుష్ప 2 ది రూల్ నేపధ్య సంగీతం ఇతరులకు వెళ్ళిపోయిన నేపథ్యంలో చెన్నైలో జరిగే కిస్సిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్…