టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర సందర్భంగా లోకేష్….స్థానిక మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ‘మహాశక్తితో లోకేష్’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో యువతులు, మహిళలు, గృహిణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ పాలనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి లోకేష్ కు వారు మొరపెట్టుకున్నారు.
ఈ సందర్భంగా జగన్ కు లోకేష్ ముద్దు పేరు పెట్టారు. ఇకపై బాయ్ బాయ్ గంజాయి బ్రో జగన్ అని పిలుద్దాం అంటూ సెటైర్లు వేశారు. అరకు, పాడేరు ప్రాంతంలో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంత బాబు ఆధ్వర్యంలో గంజాయి పండిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలోని మన్యం, అరకు ప్రాంతాలలో పండించిన గంజాయిని రాష్ట్రంలోని గ్రామగ్రామాలకు పంపిణీ చేస్తున్నారని, డీలర్ల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోందని లోకేష్ ఆరోపించారు. అధికారంలో ఉన్నవాళ్లే గంజాయిని సాగు చేసి సరఫరా చేస్తుంటే యువతీయువకులు గంజాయి మత్తుకు బానిసలు అవుతున్నారని లోకేష్ ఆరోపించారు.
తాడేపల్లిలో రోజుకో గంజాయి ఘటన జరుగుతోందని, సీఎం ఇంటికి కూతవేటు దూరంలో గంజాయి మత్తులో మహిళపై గ్యాంగ్ రేప్ జరిగితే ఇప్పటివరకు ఈ సీఎం జగన్ స్పందించలేకపోయాడని దుయ్యబట్టారు. నాయకుడు కఠినంగా లేడని, అందుకే వైసీపీ నేతలకు భయం, భక్తి లేక ఎవరిష్టం వచ్చినట్టు వారు చేస్తున్నారని ఆరోపించారు. 2024 మే నెలలో న్యూస్ ఛానల్స్ లో టీడీపీ మెజారిటీ నియోజకవర్గాలలో లీడింగ్ లో ఉంది అన్న వార్త వచ్చిన వెంటనే ఏపీలో లా అండ్ ఆర్డర్ సెట్ అవుతుందని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారికి చంద్రబాబు అంటే హడల్ అని, లోకేష్ తప్పు చేసినా చంద్రబాబు ఊరుకోరని అన్నారు.
This post was last modified on July 4, 2023 8:47 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…