యువగళం పాదయాత్ర సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం లోని నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో ‘మహాశక్తితో లోకేష్’ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చ జరిగింది. జడ్జిగా ఉన్న ఒక మహిళ ట్రైన్ దిగి వస్తుంటే గంజాయి మత్తులో ఉన్న కొందరు ఈవ్ టీజింగ్ చేసి వేధించారని ఓ మహిళా లాయర్ వాపోయారు. ఆ ఘటనపై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మహిళా మేయర్ చీర లాగినంత పని చేసినా చర్యలు లేవని విమర్శించారు. రంగనాయకమ్మ అనే 70 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసినందుకు సీఐడీ పోలీసులు కేసు పెట్టి వేధించారని ఆరోపించారు.
మరోవైపు, రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై కొందరు మహిళలు తమ సూచనలిచ్చారు. విద్యావ్యవస్థలో మానసిక, శారీరక సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఓ మహిళా సైకాలజిస్ట్ అభిప్రాయపడ్డారు. ఒక తల్లిగా కూడా ఈ మాటలు చెబుతున్నానని ఆమె అన్నారు. ఆ అంశాలు నిర్లక్ష్యం చేయడంతో పిల్లలు డిప్రెషన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, బాడీ షేమింగ్, బాడీ డిస్మార్ఫియాలకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వాటి వల్ల చిన్నతనంలోనే పిల్లలు షుగర్ తో పాటు ఇతర అనారోగ్యాలకు బలవుతున్నారని అన్నారు. కానీ, విదేశాలలో ఇటువంటి అంశాలను సీరియస్ గా పరిగణించి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని, విద్యా వ్యవస్థలో మానసిక, శారీరక సంక్షేమాన్ని భాగంగా వారు చేశారని వివరించారు.
విద్యావ్యవస్థలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఒక భాగంగా ఉండాలని చాలా దేశాలు నిర్ణయించాలని, ఆ సబ్జెక్టు కూడా కచ్చితంగా పాస్ అవ్వాలని నిబంధన పెట్టాయని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని స్కూళ్లలో సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేయాలని, పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసేలాగా వారి మానసిక ఎదుగుదలకు సంబంధించిన నిబంధనలను విధించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆమె సలహాలు, సూచనలపై లోకేష్ స్పందించారు.
తాను కూడా బాడీ షేమింగ్ బాధితుడినే అని లోకేష్ అన్నారు. గతంలో, తన శరీరంపై కూడా హేళన చేసే వారని వివరించారు. ఇక, పవిత్రమైన శాసనసభలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో భాడీ షేమింగ్ చేసిన విషయాన్ని కూడా లోకేష్ గుర్తు చేశారు. కాబట్టి శరీరాకృతిపై విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు సిలబస్ మొత్తం మార్చేయాన్నదే తన అభిప్రాయమన్నారు. ఫిన్ ల్యాండ్ మాదిరి సమగ్ర విద్యా విధానంపై దృష్టి పెడతామని, ఆ దేశవాసుల నైతిక విలువలను టీడీపీ కూడా పాటిస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కరికులం మార్పుపై దృష్టి పెడతామని లోకేష్ హామీ ఇచ్చారు.
This post was last modified on July 3, 2023 10:29 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…