ఈ రోజు ఖమ్మం జిల్లాలో జనగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్ర నేత, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీలోని పలువురు కీలక నేతలు ఈ సభకు హాజరు కాబోతున్నారు. మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు కూడా ఈ సభ సందర్భంగా జరగనుంది. అయితే, ఈ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
సభకు వచ్చే వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే రోడ్డుపై అడ్డంగా ఉన్న బారికేడ్లను తొలగించిన రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. మా ప్రజలు మేము వెళ్తున్నాం. నువ్వు ఎవడ్రా ఆపడానికి అంటూ పోలీసులపై మండిపడ్డారు. బారికేడ్లు పెడితే భయపడి ఆగిపోతామా? అది పిచ్చి భ్రమ…ఎవడ్రా మమ్మల్ని ఆపేది అంటూ ఆమె శివమెత్తారు.
తెలంగాణలో కొందరు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారని రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, బస్సులు ఇవ్వకుంటే సభకు వెళ్లలేమా అని నిప్పులు చెరిగారు. నడిచైనా సరే కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు సభాస్థలికి చేరుకుంటారని సవాల్ చేశారు. సభకు అనుమతి అడిగినప్పుడు ఇచ్చారని, ఆ తర్వాత మనసు మార్చుకున్నారని రేణుకా చౌదరి అన్నారు. డబ్బులు ఇచ్చి మరీ మీటింగ్ కు వెళ్లొద్దని చెబుతున్నారని, అడుక్కుతినే వెధవలు అంటూ బీఆర్ఎస్ నేతలపై రేణుకా చౌదరి మండిపడ్డారు.
ఇక, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మండిపడ్డారు. జన గర్జన సభకు ప్రభుత్వమే అడ్డంకులు సృష్టించడం సరికాదని హితవు పలికారు. రాహుల్ గాంధీ సభను అడ్డుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలకు సభలు, పోరాటాలు, ధర్నాలు, నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని కేసీఆర్ కు హితవు పలికారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి ఘటనలు చూడలేదని అన్నారు. పోలీసులకు కేసీఆర్ సూచనలు ఇవ్వకుంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. సీఎం ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది అని ఆరోపించారు.
This post was last modified on July 2, 2023 6:30 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…