Political News

ఆ సర్వేలో టీడీపీకి షాకింగ్ రిజల్ట్

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో 10 నెలల గడువు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని సీఎం జగన్ చెప్పిన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలకు పట్టుమని 10 నెలలు కూడా లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో తమదే విజయం అని అన్ని పార్టీలు ధీమాతో ముందుకు సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కొన్ని మీడియా సంస్థలు రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టాయి. రాబోయే ఎన్నికలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అన్న విషయంపై సర్వే చేపట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా జాతీయ మీడియా టైమ్స్ నౌ-నవ భారత్ చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పార్టీ వైసీపీకి 24 ఎంపీ స్థానాలు వస్తాయని ఆ సర్వేలో వెల్లడైంది. ఉన్నపళంగా ఎన్నికలు జరిగితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ సర్వే తన నివేదికలో వెల్లడించింది.

ఇక, ప్రధాన ప్రతిపక్షం టిడిపి ఒక ఎంపీ స్థానం వస్తుందని, జనసేన, బీజేపీలకు ఒక సీటు కూడా రాదని ఆ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు 9 నుంచి 11 లోక్ సభ స్థానాలు వస్తాయని ఆ సర్వే చెప్పింది. బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు…కాంగ్రెస్ కు 2 నుంచి 3 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది. ఇక, కేంద్రంలో అధికార బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ సర్వే తెలిపింది. కేంద్రంలో కాంగ్రెస్ 111 నుంచి 149 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది.

రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 255 నుంచి 325 స్థానాలు వస్తాయని, ప్రధాని మోడీ మరోసారి పదవి చేపట్టి హ్యాట్రిక్ కొడతారని అంచనా వేసింది. జన్ గన్ కామన్ అనే పేరుతో టైమ్స్ నౌ-నవ భారత్ చేపట్టిన ఈ సర్వే వైసీపీ, బీజేపీ నేతలకు కొత్త జోష్ ఇచ్చింది.

This post was last modified on July 1, 2023 10:23 pm

Share

Recent Posts

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

2 minutes ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

1 hour ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

2 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

3 hours ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

3 hours ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

3 hours ago