వైసీపీ అధినేత, సీఎం జగన్.. గత ఎన్నికల్లో ప్రకటించిన నవరత్నాలు.. ఇతర సంక్షేమ పథకాల దెబ్బతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. కేంద్రం వద్దకు ముఖ్యమం త్రి, ఇతర మంత్రులు వెళ్లిన ప్రతిసారీ.. మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు వస్తున్నాయనే టాక్ ఉంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తరచుగా ఈ ఉచితాలేంటి? మీ ప్రభుత్వం ఏంటి? అని పెదవి విరుస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
కానీ, అప్పటి ఎన్నికల్లో అలా జరిగిపోయిందని.. ఈ ఒక్కసారి ఆదుకోండని.. ఇకపై జరగకుండా చూస్తామ ని రాష్ట్ర ప్రభుత్వం తరచుగా కేంద్రం వద్ద వాపోతోంది. అలా చేసుకుని అప్పులు తెచ్చుకుంటోంది. అంటే.. వచ్చే ఎన్నికల నాటికి.. వైసీపీ ప్రభుత్వం ఉచితాల్లో సగానికి సగం కోతవేయాలని నిర్ణయించు కుందని.. వైసీపీ వర్గాల్లో ఒక టాక్ వెలుగు చూసింది. ప్రస్తుతం ఇస్తున్నవి చాలు అనే ధోరణిని వైసీపీ అధినేత జగన్ కూడా చెబుతున్నారని చర్చ సాగుతోంది.
అంటే.. 2024 ఎన్నికల్లో వైసీపీ కొత్తగా ప్రకటించే పథకాలు ఏమీ ఉండబోవని.. ప్రస్తుతం ఇస్తున్న వాటిలో నూ కొన్నింటిని నిలిపివేసి.. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే చర్యలు తీసుకుంటారని.. వైసీపీ వర్గాల్లో చర్చ సాగింది. అయితే.. ఇటీవల టీడీపీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో.. ఆ పార్టీలో కంటే కూడా వైసీపీలో జోరుగా చర్చకు వస్తోంది. తమ పథకాలను కాపీ కొట్టారని అంటున్నప్పటికీ.. లోలోన మాత్రం అంతర్మథనం పెరిగిపోయింది.
టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా మాతృవందనం కింద రూ. 15000 చొప్పున అందనుంది. అదేవిధంగా రైతులకు రూ.20 వేలు ఇవ్వనున్నారు. ఉద్యోగం రాని వారికి రూ.3000 చొప్పున భృతి ఇవ్వనున్నారు. ఇంకా ఇతరత్రా పథకాలను కూడా ప్రకటించారు. ఇవన్నీ చూశాక.. జగన్ అంతర్మథనంలో పడ్డారని.. టీడీపీ కన్నా.. ఒక్కటైనా ఎక్కువ ఇవ్వకపోతే.. తమకు ఇబ్బందేనని గ్రహించి.. ఇప్పుడు యూటర్న్ తీసుకోబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on June 28, 2023 11:30 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…