2024 ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని గట్టి సంకల్పం చెప్పుకొన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. ఇంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు వివాదాస్పదంగా ఉన్న.. కొన్నిచోట్ల అసలు లేని ఇంచార్జుల విషయాన్ని చంద్రబాబు సీరియస్‌గానే తీసుకున్నారు. ఎన్నికలకు మరో 8 మాసాలే గడువు ఉండడంతో చంద్రబాబు ఆదిశగా ఇప్పుడు చర్యలు తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేవారు ఎవరు? ఓడే వారెవరు అని తేల్చే నేతల గ్రాఫ్ పై సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఇంటిని చక్కదిద్దే పనిని చాలా వేగంగా చేపట్టారని సీనియర్లు చెబుతున్నారు.
ప్రస్తుతం 60కి పైగా నియోజకవర్గాలు.. టీడీపీ కళ్లు మూసుకున్నా గెలిచే పరిస్థితి ఉంది. ఆయా నియోజకవర్గాల్లో చంద్రబాబు పదే పదే పర్యటించారు. అయితే.. నేతల మధ్య సమన్వయం లేని కారణంగా.. ఆ నియోజకవర్గాల్లో ఒకింత ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాల ఇంచార్జులతో రివ్యూ మీటింగులు చేపట్టారు. మరికొన్ని స్థానాల్లో ఇంచార్జుల నియామకాన్ని టీడీపీ అదినేత వేగవంతం చేశారు. ఇప్పటికే 43 అసెంబ్లీ ఇంచార్జులతో రెండో దఫా సమీక్షలు ముగిసాయి.
ఇంచార్జుల నియామకంపై కొన్ని స్ధానాల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలుకాలని నిర్ణయించారు. ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గానికి కన్నా లక్ష్మీ నారాయణను ఇంచార్జిగా నియమించారు. అయితే.. ఇక్కడ కోడెల శివరామకృష్ణ వివాదానికి దారి తీశారు. దీనిని సరిదిద్దారు. ఇలానే.. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితిని ఇప్పుడు సరిదిద్దుతున్న సీనియర్లు చెబుతున్నారు. ఇటీవల జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిగా వీఎం థామస్, పూతలపట్టుకు కలికిరి మురళీ మోహన్‌ను నియమించారు. ఇలానే.. చిత్తూరులోని కీలక నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను నియమించాలని నిర్ణయించారు.
వర్గ పోరు లేకుండా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమలోని గోపాలపురం నియోజవకర్గంలో ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు, పార్టీ నేత బాపిరాజుల మధ్య నెలకొన్న వివాదాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మద్దిపాటికే టికెట్ అని ఇప్పటికే చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇదిలావుంటే.. పార్టీలో చేరేవారిని మరింత మందిని ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించారు. వచ్చే నెల మొదటి వారం నుంచి భవిష్యత్‌కు గ్యారెంటీపై జిల్లాల్లో చంద్రబాబు పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ముందే.. ఇంటి సమస్యలు పరిష్కరించే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తుండడం గమనార్హం.
This post was last modified on June 28, 2023 11:26 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…