ముక్కలు ముక్కలుగా అప్పులు.. ఇది ఏపీ సర్కారు చేస్తున్న ఘనకార్యం. ఎవరైనా అప్పు చేసే రిస్థితి వస్తే.. తీసుకున్న పూర్తి మొత్తానికి ఒకే తరహా వడ్డీని నిర్ణయించుకుని తీసుకుంటారు. దీనివల్ల వడ్డీ భారం అంతా.. ఏకరీతిగా ఉంటుంది. ఇది ఎవరైనా చేసే పనే. కానీ, ఏపీ సర్కారు మాత్రం ఇక్కడే అందిన కాడికి అప్పులు చేస్తూ.. ముక్కలు ముక్కలుగా తీసుకుంటోంది. అంటే.. తనకు అవసరమైన మొత్తం ఇచ్చేది లేదని చెబుతున్న సంస్థలను బతిమాలి.. బామాలి.. వారు చెబుతున్నట్టుగా వడ్డీలకు ఓకే చెప్పేస్తోంది.
దీంతో ఇస్తున్న మొత్తాన్ని ముక్కలు ముక్కలు చేస్తూ.. వడ్డీల బాదుడు బాదేస్తున్నా.. ఏపీ సర్కారు మౌనంగా తీసుకుంటోంది. అసలు అప్పు దక్కితే చాలు అన్నట్టుగా సర్కారు వ్యహరిస్తోంది. ఇప్పటి వరకు కూడా గత ఏడాది కాలంగా ఇదే పంథాను అనుసరిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం 2000 కోట్లు అప్పుగా తీసుకుంది. దీనిని బుధవారం ఇవ్వాల్సిన అమ్మ ఒడి పథకం నిధులకు వినియోగించే అవకాశం ఉందని.. ఆర్థిక శాఖ వర్గాలు అంటున్నాయి.
అయితే.. ఈ మొత్తాన్ని కూడా.. ముక్కలు ముక్కలు చేసి.. అధిక వడ్డీలకు అప్పుగా తేవడం ఆర్థిక నిపుణులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ పరిస్థితి చూస్తున్నవారు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్టే బాదుడే బాదుడు కార్యక్రమాన్ని వైసీపీ కొనసాగిస్తోందని అంటున్నారు.ఇదీ.. లెక్క…ఆర్బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.1000 కోట్లు అప్పు చేసిన సర్కారు.. 20 ఏళ్లలో చెల్లిస్తామని తెలిపింది. దీనికిగానుఏటా 7.42 శాతం వడ్డీకి అంగీకరించింది.
మరో రూ.500 కోట్లు 18 ఏళ్లకుగానూ 7.42 శాతం వడ్డీతో అప్పుగా తెచ్చింది.ఇంకో 500 కోట్లు 16 ఏళ్లకుగానూ 7.43 శాతం వడ్డీతో అప్పు తెచ్చింది. ఇలా.. ముక్కలు ముక్కలుగా చేయడం వల్ల.. వడ్డీలు పెరిగి.. ప్రజలపై మరింత భారంపడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ ఆర్థిక సంవత్సరం రుణ పరిమితిలో రూ.8 వేల కోట్లే మిగిలాయని చెబుతున్నారు.
This post was last modified on June 28, 2023 6:40 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…