Political News

కాపులను జగన్ కు ముద్రగడ తాకట్టు పెట్టారు – జోగయ్య

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పవన్ చేసిన విమర్శలు పెను దుమారం రేపాయి. ఈ సందర్భంగా వైసీపీ వర్సెస్ జనసేన అన్నరీతిలో మాటల యుద్ధం జరుగుతోంది.

ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై పవన్ ఉపయోగించిన భాషపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముద్రగడపై జనసేన, కాపు నేతలు ఎదురుదాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ముద్రగడపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ పొలిటిషియన్ చేగొండి హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇన్ని రోజులు ముద్రగడపై తనకు సదభిప్రాయం ఉండేదని, ఈ రోజు పవన్ పై ఆయన రాసిన లేఖతో అది పోయిందని హరిరామజోగయ్య దుయ్యబట్టారు. పదవుల కోసం కాపు సామాజికవర్గాన్ని జగన్ కు తాకట్టు పెట్టేందుకు ముద్రగడ సిద్ధమయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కాపు ఉద్యమాన్ని ముద్రగడ నడిపారని ఈ లేఖతో తేటతెల్లమైందని చెప్పారు.

కాపు ఉద్యమాన్ని నేటితో ముద్రగడ గంగలో కలిపేశారని హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముద్రగడ మద్దతునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే హరిరామజోగయ్య వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on June 21, 2023 9:52 am

Share

Recent Posts

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

19 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

51 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 hour ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago