Political News

ఏపీ స‌త్యం.. జ‌గ‌న్ మిథ్య‌!!

ఏపీ స‌త్యం.. జ‌గ‌న్ మిథ్య‌! ప్ర‌స్తుతం మేధావులు అంటున్న మాట ఇదే! ఎందుకంటే.. ఎక్క‌డ ఏ వేదిక ఎక్కినా.. సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే త‌న పాల‌న‌కు తానే స‌ర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. త‌న పాల‌న‌లోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంద‌ని చెబుతున్నారు. గ‌త నాలుగేళ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందింద‌ని నొక్కి వ‌క్కాణిస్తున్నారు. అయితే.. జ‌గ‌న్‌కు ముందు.. కూడా రాష్ట్రాన్ని చాలా మంది ముఖ్య‌మంత్రులు పాలించారు.

అంతెందుకు.. జ‌గన్ తండ్రి వైఎస్ ఐదున్న‌ర సంవ‌త్స‌రాలు పాలించారు. ఇక‌, జ‌గ‌న్ త‌ర్వాత కూడా.. అనేక మంది ముఖ్య‌మంత్రులు అవుతారు. జ‌గ‌న్‌తోనే ఏదీ ప్రారంభం కాలేదు.. ఆయ‌న‌తోనే ఏదీ అంత‌మూ కాదు. ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని మేధావులు చెబుతున్నారు. అందుకే.. ఏపీ స‌త్యం అనే మాటను వారు వినిపిస్తున్నారు. తాజాగా గుడివాడ‌లో ప‌ర్య‌టించిన సీఎం జ‌గ‌న్‌.. త‌న వ‌ల్లే అంతా జ‌రుగుతున్న‌ట్టు స‌ర్టిఫికెట్లు ఇచ్చుకున్నారు.

స్వ‌యం ప్ర‌క‌టిత అద్భుత‌ పాల‌న‌లో టిడ్కో గృహాల‌ను తానే నిర్మించాన‌ని కూడా చెప్పుకొచ్చారు. అయితే.. వాస్త‌వాన్ని జ‌గ‌న్ గుర్తించక‌పోయినా.. ప్ర‌జ‌లు గుర్తిస్త‌న్నార‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు పెట్టుకుంటే మంచి ద‌ని మేధావులు చెబుతున్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు జ‌రిగాయో.. ప్ర‌జ‌లకు, ముఖ్యంగా ల‌బ్ధిదారుల‌కు బాగానే తెలుసు. కానీ, త‌న‌ను తాను పెద్ద‌వాడిగా ఊహించుకుని.. త‌న హ‌యాంలోనే నిర్మాణాలు పూర్త‌య్యాయ‌ని జ‌గ‌న్ చెప్ప‌డం స‌ర్వ‌త్రా విస్మ‌యం క‌లిగిస్తోంద‌ని అంటున్నారు.

ఏదైనా చెబితే ప్ర‌జ‌లు న‌మ్మేలాగా ఉండాల‌ని.. అలాకాదంటే.. న‌ష్టం ఎవ‌రికో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. నిజానికి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. రెండేళ్ల‌పాటు.. క‌రోనా కార‌ణంగా ప‌నులు నిలిచిపోయాయి. ఉపాధి రంగం, నిర్మాణ రంగాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి. మ‌రి ఆ రెండేళ్ల‌ను తీసేస్తే.. కేవ‌లం రెండేళ్ల‌లోనే టిడ్కో గృహాలు నిర్మించారా? అనేది ప్ర‌శ్న‌. ఏదేమైనా.. చెప్పేవారు.. ఎలా ఉన్నా.. వింటున్న ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని.. మేధావులు అంటున్నారు.

This post was last modified on June 18, 2023 9:55 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

3 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 hours ago