అనుకోని ఆపద ఎదురవుతుంది. సాయం కోసం అర్థిస్తుంటారు. కానీ.. ఎవరూ స్పందించరు. అలాంటి సమయంలో హీరో ఎంట్రీ ఇస్తారు. సాహసోపేతమైన చర్యలతో ఆపద నుంచి గట్టెక్కిస్తాడు. ఇలాంటివి సినిమాల్లో చాలాసార్లు చూసి ఉంటాం. రీల్ లో కనిపించే సాహసాలు రియల్ లో చాలా తక్కువగా కనిపిస్తాయి. అందునా.. ఇలాంటి సాహసాలు చేసేవారు సాదాసీదా సామాన్యులే తప్పించి.. ప్రముఖులు.. ప్రజాప్రతినిధులు పెద్దగా కనిపించరు. కానీ.. ఆ లోటును తీర్చారు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు.
అచ్చం సినిమాల్లో మాదిరి ఆపదలో ఉన్న వారిని రక్షించిన వైనం ఇప్పడు ఆసక్తికరంగా మారటమే కాదు.. అతని వివరాల కోసం ఆసక్తిగా వెతుకుతున్నారు. గుజరాత్ లోని రాజుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు బీజేపీకి చెందిన హీరో సోలంకి. కోలి వర్గానికి చెందిన ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. పట్వా గ్రామం సమీపంలోని సముద్రం వద్దకు కల్పేష్, విజయ్, నికుల్, జీవన్ అనే నలుగురు యువకులు స్నానం చేయటానికి సముద్రంలోకి వెళ్లారు.
అప్పటివరకు బాగానే ఉన్నా.. ఒక్కసారిగా ప్రవాహం పెరిగిపోవటం.. పెద్ద గాలి వీయటంతో వారంతా సముద్రంలోకి జారిపోయారు. ఆ వెంటనే భయంతో వారు కేకలు వేయటం మొదలు పెట్టారు.సముద్రం ఒడ్డున చాలామంది ఉన్నప్పటికీ.. ఎవరూవారిని సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఇలాంటి వేళలో.. బీజేపీ ఎంపీ హీరా సోలంకి సముద్రంలోకి దూకి.. కొట్టుకు పోతున్న నలుగురిలో ముగ్గురిని కాపాడారు.
ఎమ్మెల్యేకు సాయం చేసేందుకు మరబోటు రావటం.. సముద్రంలో మునిగిపోతున్న ముగ్గురు యువకుల్ని రక్షించి.. వారిని బోటులోకి ఎక్కించారు. అనంతరం ఆయన్నుబోటులోకి ఎక్కించి ఒడ్డుకు తీసుకొచ్చారు. నలుగురు యువకుల్లో జీవన్ మాత్రం కొట్టుకుపోయారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తుండగా.. బుధవారం సాయంత్రం అతడి డెడ్ బాడీ ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఈ ఉదంతంలో సాహసోపేతంగా వ్యవహరించిన బీజేపీ ఎమ్మెల్యే హీరా సోలంకిని అభినందిస్తున్నారు.
This post was last modified on June 1, 2023 10:23 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…