రాష్ట్రంలోని విభజిత 26 జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఏంటి అనేది చూస్తే 13 జిల్లాల్లో వైసీపీ పరిస్థితి ఇంత గందరగోళంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ నేతలు ప్రతిరోజు ఏదో ఒక విషయంలో తలపడుతూనే ఉన్నారు. దీనికి తోడు ఎస్సీల విభజన, ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్, ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్‌ను వేరే వారికి ఇస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
విజయనగరం, విశాఖపట్నం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది మంటలు రేపుతోంది. అదే విధంగా రాయలసీమ జిల్లాలకు వచ్చేసరికి ఇక్కడ కూడా అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగాయి. సొంత నేతలు దోపిడీ చేస్తున్నారని అంతర్గతంగా వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, వైసీపీ నాయకులు రోడ్డున పడడం వంటివి చర్చకు దారితీస్తున్నారు.
ముఖ్యంగా మంత్రులుగా ఉన్నటువంటి వారిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎంపీ గోరంట్ల మాధవ్, మంత్రి ఉషశ్రీ చరణ్, మంత్రి గుమ్మనూరు జయరాం వంటి వారిపై తీవ్ర ఆరోపణలు రావడం వారు వివాదాస్పదం కావడం జిల్లాలను కుదిపేస్తోంది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈసారి ఓటు బ్యాంకు భారీగా తగ్గేటటువంటి ప్రమాదం కనిపిస్తోందని అంటున్నారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీ ఓటు బ్యాంకు ఈసారి జనసేనకు పడుతుంది అనే చర్చ నడుస్తోంది.
అక్కడ యువత జనసేనకు అనుకూలంగా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ పరంగా కాకుండా అభిమానంపరంగా చూసుకున్నట్లయితే పవన్ కు ఉభయ గోదావరి జిల్లాల్లో యువత మెజారిటీ ఓటు బ్యాంకు గా మారుతున్నారు. ఈవిషయంపై జనసేన వర్గాలు కూడా దృష్టి పెడుతున్నాయి. అదేవిధంగా శ్రీకాకుళం లో జనసేన ప్రభావం కనిపిస్తోంది. అనంతపురంలోనూ జనసేన ప్రభావం కనిపిస్తోంది. ఇక, విజయవాడలో టిడిపి ప్రభావం ఎక్కువగా ఉంది.
అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే విభజిత 26 జిల్లాల్లో 13 జిల్లాల్లో వైసిపి పరిస్థితి ప్రశ్నార్థకంగానే మారింది అనేది పరిశీలకుల అంచనా. ముందస్తు ఎన్నికలకే వెళ్ళినట్లయితే ప్రస్తుత వ్యూహాలు సరిపోతాయా అనేటటువంటిది వేచి చూడాలి. ఏదేమైనా నాయకులను బట్టే ఈసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నాయకుల పరిస్థితికి దారుణంగా ఉండడం వైసిపికి తలనొప్పిగా మారింది అనేది వాస్తవం.
This post was last modified on June 1, 2023 10:13 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…