ఏపీపై బీజేపీ పెద్దల అభిప్రాయం ఏంటి? అసలు ఏపీని ఏ విధంగా వాళ్ళు డీల్ చేయాలి అనుకుంటున్నారు? వచ్చే ఎన్నికలకు సంబంధించి అసలు బిజెపి పెద్దలు ఏపీలో పావులు కదపాలని గాని ఇక్కడ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపించడం లేదా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసిపి తమకు అనుకూలంగా ఉండడం వైసిపి నుంచి కావలసినవన్నీ జరుగుతుండటం బీజేపీకి కలిసివస్తున్నాయి.
ఈ కారణంతో ఏపీలో ప్రభుత్వం అవసరం లేకపోయినా లోక్‌సభలో తమకు మద్దతు ఇచ్చే పార్టీ బలంగా ఉంటే చాలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో బిజెపి పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీకి వారు సహకరిస్తున్నారు అనేటటువంటి చర్చ కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. ఇక ముందస్తు ఎన్నికలకు సంబంధించి వైసీపీ వ్యూహానికి బిజెపి పచ్చ జెండా ఊపింది అనేటటువంటి చర్చ తాజాగా తెరమీదకు వచ్చింది. నిజానికి బిజెపి పరిస్థితిని గమనిస్తే అధికారంలోకి వస్తాం అని పదే పదే చెబుతున్నటువంటి బిజెపి నేతలు ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించడం లేదు.
కేవలం వైసీపీకి దన్నుగా ఉన్నారు అనేటటువంటి మాట పదే పదే వస్తున్నా దీనికి కూడా వారు సమాధానం చెప్పడం లేదు. మద్దతిస్తున్నారని మద్దతు ఇవ్వడం లేదని గాని స్పందించడం లేదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అప్పులు ఎక్కువగా ఇస్తున్నారు. అనుకూలంగా సహకరిస్తున్నారు అనేటటువంటి చర్చ అయితే జోరుగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికలను ప్రాణంగా భావించే బీజెపి నాయకులు వచ్చే ఎన్నికల్లో ఏపీలో కనీసం 10 నుంచి 15 స్థానాల్లో అయినా గెలుపొందాలి అనే వ్యూహం పెట్టుకున్నారు.
ఈ విషయాన్ని జాతీయ మీడియా కొన్నాళ్లుగా చెప్తోంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా కేవలం లోక్‌సభలో తమకు మద్దతు ఇచ్చేటటువంటి వైసీపీకి అండగా నిలవాలి అనేటటువంటి చర్చ తెరమీదికి వచ్చింది. ఇదే జరిగితే బిజెపికి కోలుకోలేనటువంటి దెబ్బ తగలడం ఖాయంగా ఉంది. జనసేన టిడిపితో కలిసి బిజెపికి ముందుకు వెళ్లినట్లైతే 2014లో సాధించినట్టుగా నాలుగైదు సీట్ల నుంచి అసెంబ్లీలో పార్లమెంటుకు ఒకటి రెండు స్థానాల్లో అయినా గెలుపొందే అవకాశం ఉంది.
కానీ ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు పచ్చ జెండా ఊపినట్లైతే బిజెపితో కలుస్తుందా లేదా అనేది మరో చర్చగా మారింది. ఇక పార్లమెంట్ విషయానికి వచ్చినట్టయితే వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీలు దాదాపు బిజెపికి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని చర్చ ఉంది. వచ్చే ఎన్నికల్లో బిజెపి ఏపీ ని వదిలేసుకుందా లేకపోతే ఏపీలో పావులు కదపాలని నిర్ణయించుకుందా అనేది కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.
ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి అంచనాలు ప్రకారం వైసిపికి దన్నుగా నిలుస్తోంది అనేటటువంటి చర్చ మాత్రం జరుగుతుంది. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో బిజెపి పెద్దగా పోటీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నటువంటి వైసీపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే గనక జరిగితే రాష్ట్రంలో వైసిపి బిజెపిలు కలిసి పోటీ చేయకపోయినా వేరువేరుగా పోటీ చేసినా ఒకే మార్గంలో ఒకే దిశలో నడిచేటటువంటి అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on June 1, 2023 1:18 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…