ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ అనూహ్యంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం.. దీనిలో ఒక తీర్మానం చేసి.. గవర్నర్‌కు పంపి.. ప్రభుత్వాన్ని రద్దు చేయడం.. ఆ వెంటనే తెలంగాణతో సమానంగా ఎన్నికలకు వెళ్లడం చేస్తారని అంటున్నారు. అయితే.. దీనిలో నిజం ఎంతో తెలియదు కానీ.. ఇప్పటికిప్పుడు మాత్రం ఈ విషయం హాట్‌గా మారింది.
అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని.. వైసీపీ నాయకులు చెబుతు న్నారు. దీనికి ప్రధానంగా నాలుగు కారణాలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను 98.44 శాతం అమలు చేశామని పార్టీ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ప్రజలు విశ్వసించడం లేదన్నది మెజారిటీ ఎమ్మెల్యేల మాటగా ఉంది. ముఖ్యంగా సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారని.. వీరిని ఏదో ఒక రకంగా శాంతింపచేయకుండా వెళ్తే.. ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
ఇక, పింఛన్లను రూ.3000 చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని.. ఇది కూడా అమలు చేయలేదని.. ఇప్పటికిప్పుడు.. ఈ హామీని నెరవేర్చకుండా.. ముందుకు సాగితే.. ఎలా? అనేది ఎమ్మెల్యేల మాట. మరో కీలకమైన విషయంపోలవరం. దీనిని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చామని.. కానీ, నాలుగేళ్లు గడిచినా.. ఇప్పటికీ అమలు చేయలేకపోయామని చెబుతున్నారు.
అదేసమయంలో జిల్లాలను ఏర్పాటు చేసినా.. దీనికి రాష్ట్రపతి నుంచి ఆమోదం పొందలేక పోయారు. దిశ చట్టాన్ని చేసినా.. కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోలేక పోయారు. ఈ రెండు విషయాలు కూడా.. ఇప్పటికీ ప్రజల్లో చర్చకు వున్నాయని.. కాబట్టి.. ఇలాంటి కీలకమైన హామీల విషయంలో ఆచి తూచి ప్రజల దగ్గర మార్కులు వేయించుకోకుండా.. ముందుకు సాగితే ప్రమాదమేనని.. ముందస్తు ముంచేస్తుందని చాలా మంది గుసగుసలాడుతున్నారు.
This post was last modified on May 31, 2023 3:39 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…