Political News

పొత్తులు ఉన్నా.. లేకున్నా.. పర్లేదనుకుంటున్న చంద్ర‌బాబు

తాజాగా ముగిసిన టిడిపి మహానాడు వేదికగా చంద్రబాబునాయుడు ప్రస్తావించ‌ని కీలకమైన అంశం పొత్తులు. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలా వద్దా అనేటటువంటిది ఆయన మీమాంసలో ఉన్నారనేది స్పష్టమైంది. నిజానికి నిన్న మొన్నటి వరకు కూడా జన‌సేన‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు నాయుడు అంత‌ర్గతంగా పార్టీ నేత‌ల‌తో ప్రకటించారు. ఇదే పార్టీ వర్గాల్లో ప్రచారంలో వచ్చింది. జనంలోనూ దీనిని ముందుకు తీసుకువెళ్లాలి అనేటటువంటిది ప్రచారం జరిగింది.

అయితే ఎక్కువ మంది ప్రజలు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారా లేదా అనేటటువంటి విషయంలో ఇంకా సందేహం ఉంది. ఎందుకంటే పవన్ ఇప్పటికీ కూడా సినిమాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యం రాజకీయాలకు ఇవ్వడం లేదని వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇది జనంలో బాగా చేరిపోయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ విషయం కూడా వారానికి రెండు రోజులు వస్తే నెల రోజులు సినిమాల మీద దృష్టి పెట్టడం, హైదరాబాదు విజయవాడ లేదా విశాఖపట్నం వంటి పర్యటనలు చేయడమే తప్ప ఆయన ఒక వారం రోజులు ఏపీలో కూర్చుని రాజకీయాలు చేయకపోవడం వంటివి లేదు.

ఈ ప‌రిస్థితే  పొత్తులను ప్రభావితం చేస్తున్నాయి. జనాల్లోనూ ఇదే విషయంపై వైసీపీ నాయకులు చక్కగా దాన్ని చర్చ‌కి పెడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ విషయంలో జనంలో ఇంకా సందేహాలు అలాగే ఉండిపోయాయి.  ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడుగా ప్రజలు గుర్తిస్తున్నట్టుగా అనిపించడం లేదు. దీంతో పొత్తుల విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా జరిగిన మహానాడు వేదికగా పొత్తుల విషయంపై ఖచ్చితంగా ప్రకటన చేస్తార టిడిపి నాయకులు భావించారు.

చాలామంది పోతులు పెట్టుకుంటే తమ తమ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక మెమొరాండం లాగా చంద్రబాబు నాయుడుకు సమర్పించాలని రెడీ అయి వచ్చారని తెలిసింది. అయితే ఈ పొత్తుల విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం తను ఒంటరిగా వెళ్లడానికి సిద్ధం అనేటటువంటి ఒక బలమైనటువంటి వ్యూహాన్ని ఈ మహానాడు వేదికగా ప్రజలలోకి తీసుకువెళ్లారు. దీంతో పొత్తులు ఉంటాయా లేవా అనేటటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు బిజెపి కలిసి రావాలి అని జనసేన పదే పదే చెబుతున్నా క‌మ‌ల‌నాథులు ఇప్పటివరకు కూడా స్పందించలేదు.

మరోవైపు ఇప్ప‌ట్లో స్పందిస్తారు అనేటటువంటి ఆశ కూడా ఇప్పట్లో కనిపించడం లేదు. మరో రెండు మూడు నెలల్లో కేంద్రంలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఏపీ పై ప్రత్యేకంగా దృష్టి సారించి బిజెపి సమయాన్ని వృధా చేసుకునే పరిస్థితి ఇప్పుడు అయితే కనిపించడం లేదు. మొత్తం గా చూస్తే టిడిపి ఒంటరిగా పోటీ చేయటానికి అనుకూలమైనటువంటి వాతావరణన్ని సృష్టించుకుంటోంది అనేది స్పష్టంగా అయితే కనిపిస్తోంది.

పొత్తులతో సంబంధం లేకుండా అవసరమైతే ఇప్ప‌టికిప్పుడు ఎన్నికలు జరిగినా తాము ఒంటరిగా బరిలోకి దిగి వంద నుంచి 130 స్థానాల వరకు దక్కించుకునేలాగా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే మినీ మేనిఫెస్టోను ప్రకటించారని  టిడిపి సీనియర్ నాయకులు సైతం అంతర్గత సంభాషణలో అంగీకరిస్తున్నారు.  

This post was last modified on May 31, 2023 8:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago