తెలంగాణా లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రిచ్చెస్ట్ రాజకీయ పార్టీ ఏదంటే ఎవరైనా బీఆర్ఎస్ అనే చెప్పాలి. ఆ పార్టీకి స్ధిర, చరాస్తులు విపరీతంగా పోగుపడుతున్నాయి. బ్యాంకుల్లో పార్టీ ఖాతాలో సుమారు రు. 760 కోట్లు ఉన్నట్లు కేసీయారే చెప్పారు. అందుకనే పార్టీ కోసం ప్రత్యేకంగా విమానాన్నే కొనుగోలు చేయాలని కేసీయార్ ఆ మధ్య చాలా ఆలోచనలు చేశారు. తర్వాత ఎందుకో ఆ జోరు తగ్గింది. ఇపుడిదంతా ఎందుకంటే ఈ మధ్యనే కోకాపేటలో విలువైన భూములను బీఆర్ఎస్ కు దక్కేట్లుగా కేసీయార్ నిర్ణయం తీసుకుని అమలుచేశారు.
అందుబాటులోని సమాచారం ప్రకారం బీఆర్ఎస్, స్ధిర, చరాస్తుల విలువ సుమారు రు. 1700 కోట్లుంటుందని అంచనా. కోకాపేటలో పార్టీకి దఖలు పడిన భూమి విలువే విపరీతంగా ఉందట. కోకాపేటలో పార్టీ కోసమని ప్రభుత్వం 11 ఎకరాలను కేటాయించింది. దీని విలువ ప్రస్తుతం మార్కెట్లో రు. 600 కోట్లుంటుంది. ఇక 24 జిల్లాల్లోను పార్టీ ఆఫీసులున్న స్ధలాల విలువ సుమారు రు. 200 కోట్లట. ఇదికాకుండా బంజారాహిల్స్ లోని పార్టీ ఆఫీసు స్ధలం విలువ సుమారు రు. 130 కోట్లు. ఢిల్లీలోని ఆఫీసు భూమి విలువ సుమారు రు. 100 కోట్లు.
చరాస్తుల విలువ రు. 1200 కోట్లని ఇందులో బ్యాంకుల్లో నిల్వున్న క్యాషే సుమారు రు. 750 కోట్లుగా కేసీయరే ప్రకటించారు. దీని మీద నెలకు రు. 7 కోట్ల వడ్డీయే అందుతోంది. ఈ వడ్డీ డబ్బుతోనే పార్టీ ప్రచారం, మీడియాకు ఇచ్చే ప్రకటనలు సరిపోతోందట. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత రిచ్చెస్టు పార్టీ మరోటిలేదనే చెప్పాలి.
గతంలో పార్టీలు కూడా ప్రభుత్వ స్ధలాలనే పార్టీ ఆఫీసులకు కేటాయించుకున్నాయి. అయితే ఇంత పెద్దఎత్తున ఎకరాలకు ఎకరాలను కేటాయించుకోలేదు. ఇపుడు కేసీయార్ చేస్తున్నది ఏమిటంటే హైదరాబాద్ లోనే రెండుచోట్ల అత్యంత విలువైన బంజారాహిల్స్, కోకాపేటలో ప్రభుత్వ స్ధలాలను కేటాయించుకున్నారు. 2018 తర్వాతే పార్టీకి కోట్లాదిరూపాయల విలువైన ఆస్తులు సమకూరాయి. ఎలాగంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలోను పార్టీ ఆఫీసుకు భవనం పేరుతో ప్రభుత్వ స్ధలాలను కేటాయించేసుకున్నారు. వాటికి అదనంగా ఇపుడు కోకాపేటలో అత్యంత విలువైన స్ధలం కూడా సొంతమైపోయింది.
This post was last modified on May 30, 2023 4:51 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…