Political News

రూ.2 లక్షల కోట్లు డిపాజిట్ అవుతాయా..

ప్రభుత్వం ప్రకటించిన ఒక నిర్ణయం  ఇప్పుడు దేశ  ప్రజల్లో గుబులు రేపుతోంది. తమ దగ్గరున్న రూ.2 వేల రూపాయల నోట్లను  వదిలించుకునేందుకు  జనం  నానా తంటాలు  పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవ్వాల్టి నుంచి ( మంగళరవారం) జనం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. రోజుకు 20 వేలకు మించి మార్చుకునే అవకాశం లేదని చెప్పడంతో చాలా మంది రోజూ బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రాబోతోంది. పైగా యాభై వేల  డిపాజిట్ దాటితే  ప్యాన్ నెంబర్  తప్పనిసరి అని రిజర్వ్  బ్యాంక్ ప్రకటించడం జనానికి  ఇబ్బందేనని చెబుతున్నారు. దానితో 2016 నాటి పరిస్థితి రావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

2023 మార్చి నాటికి, చెలామణిలో ఉన్న నోట్లలో రూ. 2,000 నోట్ల వాటా 10.8%, వాటి మొత్తం విలువ రూ. 3.62 లక్షల కోట్లు. 2018 మార్చిలో గరిష్టంగా రూ. 6.73 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్ల చలామణీలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో చాలావరకు రూ. 2,000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల డిపాజిట్ బేస్ తో  పాటు  సిస్టమ్ లిక్విడిటీ మెరుగు పడుతుందని భావిస్తున్నారు. మొత్తంగా, బ్యాంక్‌ డిపాజిట్లు రూ. 1.5 లక్షల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్ల వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.  

బ్యాంకుల్లోకి వచ్చే రూ.2 వేల నోట్ల సొమ్ములో 40 నుంచి యాభై  శాతం అంటే దాదాపుగా రూ. 90 వేల కోట్ల వరకు దీర్ఘకాలిక డిపాజిట్లుగా మారతాయని  అంచనా వేస్తున్నారు బ్యాంకులు కొత్త రుణాలిచ్చి లాభాలు పొందేందుకు వారి వద్ద ఇబ్బడి ముబ్బడిగా నిధులుంటాయి. దానితో బ్యాంకుల ఆర్థిక స్థితి, లాభాలు మెరుగు పడే ఛాన్సుంది. రూ.2 వేల నోట్ల ఉపసంహరణ మాత్రమే జరుగుతోందని, చెలమాణి కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినప్పటికీ జనంలో భయం మాత్రం కొనసాగడం ఖాయం. ఆ నోట్లను ఏదో విధంగా బ్యాంకులకు చేర్చడం అంతే ఖాయం.

This post was last modified on May 23, 2023 10:16 am

Share
Show comments
Published by
Satya
Tags: 2000 notes

Recent Posts

రెండు దెబ్బలతో ఉద్యోగులు వెరీ వెరీ హ్యాపీ

ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మొన్నటిదాకా అత్యంత దుర్భరంగా ఉండేది. నెలంతా కష్టపడి కూడా వేతనాల కోసం వారు నెలాఖరు దాకా…

34 minutes ago

పవన్ అభిలాష… బాబు హ్యాట్రిక్ కొట్టాలి

ఏపీలోని అధికార కూటమి సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉండాలని... ఆ కూటమిలోని కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన అధినేత, ఏపీ…

2 hours ago

పడిపడి నవ్వి… ‘పది సార్లు బల్ల గుద్దిన’ బాబు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం అత్యద్భుతమైన వేడుకలతో ముగిశాయి. 'ఆంధ్రప్రదేశ్ లెజిస్టేచర్ కల్చరల్ ఈవెనింగ్' పేరిట నిర్వహించిన కార్యక్రమం…

4 hours ago

అవును.. ఈ కుక్క ఖరీదు రూ.50 కోట్లు

బెంగళూరుకు చెందిన ఎస్. సతీష్ తన అరుదైన పెంపుడు జంతువులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి రికార్డు సృష్టించారు.…

5 hours ago

రాజ‌కీయాలు వ‌ద్దులే.. టాలీవుడ్ సంచ‌ల‌న నిర్ణ‌యం?

రాజ‌కీయాల‌కు-సినిమా ఇండ‌స్ట్రీకి మ‌ధ్య అవినాభావ సంబంధం ఉన్న విష‌యం తెలిసిందే. అన్న‌గారు ఎన్టీఆర్‌తో ప్రారంభ‌మైన సినీ రాజ‌కీయాలు.. నిన్న మొన్న‌టి…

7 hours ago

బాబుకు తిరుగులేదు.. మ‌రో 20 ఏళ్లు ఆయ‌నే : జాతీయ మీడియా

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు తిరుగులేదా? ఆయ‌న పాల‌నా ప్ర‌భ మ‌రింత విరాజిల్లుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి జాతీయ…

7 hours ago