హైదరాబాద్ కు మరో ఆకర్షణ చేరనుంది. కాకుంటే.. దీన్ని ప్రభుత్వం కాకుండా ప్రైవేటు సంస్థ చేపట్టనుంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ తాజాగా హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ చేసింది. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు.
శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వంద ప్రాంతాల్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని నిర్వహిస్తుండటం ఒక ఎత్తు అయితే.. అందులో 50 కార్యక్రమాలు అమెరికాలోని 50 నగరాల్లో నిర్వహిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. తెలుగు వారి సత్తాను చాటేందుకు ఈ కార్యక్రమ నిర్వహణ తోడ్పడుతుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ కు ముందు తెలుగు వారికి ఎలాంటి గుర్తింపు లేదని.. అలాంటిది ఈ రోజున అమెరికాలో 20వ భాషగా తెలుగుకు గుర్తింపు దక్కిందంటే దానికి ఎన్టీఆర్ కల్పించిన స్ఫూర్తిగా చంద్రబాబు చెప్పారు.
భావి తరాల కోసం ఎన్టీఆర్ ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని.. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడే డాక్టర్ బీఆర్అంబేడ్కర్ కు భారతరత్న పురస్కారం వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. శతజయంతి వేడుకల్ని ఎలాంటి లోపం లేకుండా గొప్పగా చేశారంటూ నిర్వాహకుల్ని ప్రశంసించారు చంద్రబాబు. చైనాతోయుద్ధం వస్తే యువతలో దేశభక్తి నింపేందుకు పలు కార్యక్రమాల్నిచేశారని.. దివిసీమకు ఉప్పెన వచ్చి.. కొన్ని వేల మంది చనిపోతే జోలె పట్టి ప్రజలకు సాయం చేశారన్నారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి అంటూ కీర్తించిన చంద్రబాబు.. తెలుగు జాతి ఉన్నంత వరకు అందరి గుండెల్లో శాశ్వితంగా నిలిచిపోతారన్నారు.
ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని.. దాన్ని సాధించే వరకు పోరాడతామని పేర్కొన్నారు చంద్రబాబు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు.. సినిమా రంగానికి చెందిన వారు హాజరుకావటం ఆసక్తికరంగా మారింది.
This post was last modified on May 21, 2023 12:38 pm
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…