నందమూరి అభిమానుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్‌క్లూజివ్ అభిమానులది వేరే వర్గం. వాళ్లు కేవలం ఎన్టీఆర్‌కు మాత్రమే అభిమానులు. తారక్ వరకు వస్తే బాలయ్యను కూడా వాళ్లు పక్కన పెట్టేస్తుంటారు. ఈ వర్గం అభిమానులకు బాలయ్య మీదే కాక నారా చంద్రబాబు నాయుడి మీద కూడా చాలా కోపం ఉంది ఏళ్లుగా.
2009 ఎన్నికల కోసం తారక్‌ను వాడుకుని.. ఆ తర్వాత పక్కన పెట్టేశారని.. ఆ ఎన్నికల్లో ఓటమికి తారక్‌ను బాధ్యుడిని చేశారని వారిలో అసంతృప్తి ఉంది. అలాగే నారా లోకేష్ ఎలివేట్ కావడం కోసం తారక్‌ను ఉద్దేశపూర్వకంగా తొక్కేస్తున్నారని కూడా వారు ఆరోపిస్తుంటారు. కారణాలు ఏమైతేనేం తారక్‌కు.. బాబు, బాలయ్యలకు మధ్య పెద్ద అగాథం ఏర్పడిన విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు కూడా అభ్యంతరకరంగానే ఉంటోంది.
కట్ చేస్తే.. ఏడాదిగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరుగుతున్నాయి. గత నెల విజయవాడలో ఒక పెద్ద వేడుక నిర్వహిస్తే.. దానికి తారక్‌ను ఆహ్వానించకపోవడాన్ని అతడి అభిమానులు తప్పుబట్టారు. కానీ దానికి రజినీకాంత్ ముఖ్య అతిథి అని.. నందమూరి కుటుంబం నుంచి ఇతరులెవ్వరూ కూడా ఈ వేడుకకు రాలేదని అటు నుంచి వాదన వినిపించింది. కాగా ఇప్పుడు హైదరాబాద్‌లో మరో వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, వెంకటేష్ తదితరులతో పాటు తారక్‌ను కూడా ఆహ్వానించారు. ఈ వేడుకను నిర్వహిస్తునన్న టీడీ జనార్ధన్ స్వయంగా తారక్‌కు వెళ్లి ఇన్విటేషన్ ఇచ్చి వచ్చారు. కానీ శనివారం తన పుట్టిన రోజు కావడంతో విదేశాల్లో కుటుంబంతో కలిసి ఆ వేడుక చేసుకోవడానికి ముందే ప్లాన్ చేసుకున్న తారక్.. ఈ వేడుకలకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నట్లు ముందే క్లారిటీ ఇచ్చేశాడు. ఆహ్వానితుల్లో రామ్ చరణ్, వెంకటేష్ మాత్రమే వచ్చారు. మిగతా స్టార్ హీరోలు రాలేదు. కానీ వాళ్ల సంగతి పక్కన పెడితే తారక్ రాకపోవడం చాలామందిని నిరాశపరిచింది. ఈ వేడుకకు వచ్చి తాత గురించి తారక్ మాట్లాడి ఉంటే ఆ కిక్కే వేరుగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ వేడుకకు రాకపోవడానికి తారక్‌కు బలమైన కారణమే ఉంది.
ఐతే తారక్ తన పుట్టిన రోజున అందుబాటులో ఉండడని తెలిసి అదే రోజు వేడుక పెట్టి.. అతణ్ని ఆహ్వానించినా రాలేని పరిస్థితిని చంద్రబాబు క్రియేట్ చేశారని.. తద్వారా నింద అతడిపైకి నెట్టేయాలని చూశారని.. ఇదంతా వ్యూహాత్మకంగా జరిగిందని.. ఇది బాబు మార్కు రాజకీయం అని తారక్ అభిమానులు మండిపడుతున్నారు. తారక్‌ను ఇంకా ఎంత కాలం ఇలా టార్గెట్ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on May 21, 2023 10:51 am
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…
వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల అసహనానికి గురైన వా వాతియర్ (అన్నగారు వస్తారు) ఎట్టకేలకు విడుదలకు రెడీ అయ్యింది. జనవరి…