కుప్పం ఇప్పుడు వైసీపీ టార్కెట్. వచ్చే ఎన్నికల్లో అక్కడ చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో కుప్పంపై జగన్, పెద్దిరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు కుప్పం వచ్చినప్పుడు అక్కడ రచ్చ చేయడం, టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులను చేయడం పరిపాటిగా మారింది. 1989 నుంచి కుప్పంలో గెలుస్తున్న చంద్రబాబును దెబ్బకొట్టాలన్న వైసీపీ సంకల్పం నెరవేరకుండా అడ్డుకుంటున్న టీడీపీ కేడర్ పై కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. బిజీగా ఉండే చంద్రబాబు కుప్పంపై దృష్టి పెట్టలేరని వైసీపీ నమ్మకం..
కేడర్ లో మనోధైర్యం నింపాలంటే తానే రంగంలోకి దిగాలని చంద్రబాబు డిసైడయ్యారు. దానితో మూడు నెలలకోసారైనా కుప్పం టూర్ ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ సర్కారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకంజ వేయకుండా కేడర్ ను ఉత్తేజ పరిచే చర్యలు చేపడుతున్నారు. వైసీపీ అరాచకాలను కుప్పం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నందున రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనలు సాగించాల్సిన పరిస్దితులు ఉన్నాయి. అందుకే తన తరపున పనిచేసేందుకు చంద్రబాబు ఓ టీమ్ సిద్ధం చేశారు. కుప్పంనియోజవర్గానికి ప్రత్యేక ఇన్ చార్జీని నియమించారు.కొత్తగా సమన్వయ కమిటిని ఏర్పాటు చేస్తూ కమిటి చైర్మన్ గా పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్దానం నుంచి తాజాగా గెలిచిన కంచెర్ల శ్రీకాంత్ ను నియమించారు.సమన్వ కమిటికి ఇన్ చార్జీగా పీఎస్ మునిరత్నంను,సభ్యులుగా మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు,చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ తోపాటు మరికొందమంది యువనాయకులకు అవకాశం కల్పించారు
కుప్పంలో వైసీపీ అరాచకాలను ధీటుగా ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో కుప్పంలో లక్ష ఓట్లకుపైగా మెజారిటీ సాధించి పెట్టగల సమర్థత కంచెర్ల శ్రీకాంత్ కు ఉందని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. చంద్రబాబు నిర్ణయంతో కంచెర్ల శ్రీకాంత్ , కుప్పానికే మకాం మార్చారు. పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు కోసం నమ్మకంగా పనిచేస్తున్నారు…
This post was last modified on May 19, 2023 7:10 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…