తాజా కర్ణాటక ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర కలిసి వచ్చింది. కర్ణాటకలో రాహుల్ జోడో యాత్ర సాగిన నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కర్ణాటకలో 7 జిల్లాల్లోని 20 నియోజకవర్గాల మీదుగా గత ఏడాది సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 23 వరకు రాహుల్ భారత్ జోడో యాత్ర సాగింది. వాటిలో 15 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
నిజానికి ఈ నియోజకవర్గాలు బీజేపీ, జేడీఎస్ కంచుకోటలు. మైసూరు జిల్లాలో 5, తుముకూరు జిల్లాలో 4, మాండ్యా, చిత్రదుర్గ జిల్లాల్లో 3 చొప్పున, బళ్లారి, రాయచూర్ జిల్లాల్లో 2 చొప్పున, చామరాజనగర జిల్లాలో ఒక నియోజకవర్గంలో రాహుల్‌గాంధీ యాత్ర నిర్వహించారు. ఈ 20 స్థానాల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 5 స్థానా లకే పరిమితమవ్వగా బీజేపీ 9 స్థానాలు, జేడీఎస్ 6 స్థానాలు గెలుచుకున్నాయి.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుని 15 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కేవలం 2 స్థానాలకు, జేడీఎస్ 3 స్థానాలకు పరిమితమయ్యాయి. మాండ్యా, చిత్రదుర్గ, చామరాజనగర జిల్లాల్లో యాత్ర జరిగిన అన్ని నియోజకవర్గాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. భారత్ జోడో యాత్ర కర్ణాటక ఎన్నికలపై ప్రభావం చూపడమే కాకుండా కార్యకర్తల్లో పునరుత్తేజం కలిగించింది. ఈ ఏడు జిల్లాల్లో 51 అసెంబ్లీ స్థానాలు ఉండగా 36 చోట్ల కాంగ్రె స్ విజయం సాధించింది. బీజేపీ విద్వేషపూరిత రాజకీయాలను కన్నడిగులు తిప్పికొట్టారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on May 14, 2023 12:12 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…