ఏపీలో పోలీసులు ఎంత అకృత్యంగా వ్యవహరిస్తున్నారో.. ఎంత దారణంగా వ్యవహరిస్తున్నారో.. ఇప్పటి వరకు చెప్పుకోవడమే తెలుసు. కానీ.. ఇప్పుడు తాజాగా తెరమీదకి వచ్చిన ఓ ఫొటో ఏపీలో ప్రజాస్వామ్యం, నిబంధనలు ఏవిధంగా పోలీసుల బూటు కాళ్ల కింద నలుగుతున్నాయో.. స్పష్టంగా చెబుతోందని అంటున్నారు బీజేపీ నాయకులు. తాజాగా సీఎం జగన్ నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను కలుసుకుని. స్థానిక సమస్యలు విన్నవించుకునేందుకు వెళ్లిన బీజేపీ నాయకుడిని పోలీసులు రెండు కాళ్ల మధ్య పెట్టి నలిపేసిన ఘటన వెలుగు చూసింది.
ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా కావలిలో బిజెపి నేతల పై పోలీసులు అరాచకంగా వ్యవహరిస్తూ ఒక భయానక వాతావారణాన్ని సృష్టిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పేందుకు వెడితే పోలీసులు బిజెపి నేతలు పై వ్యవహరించిన తీరు చూస్తే రాష్ట్రం లో ప్రజాస్వామ్యం లేదన్నట్లుగా కనపడుతోందన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళితే ఒక్కసారిగా పోలీసులు బిజెపి జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ తో సహా పలువురి పై దాడికి పాల్పడ్డారని చెప్పారు.
ప్రజాస్వామ్యంలొ ఉన్నామా నిరంకుశ రాచరిక వ్యవస్ధలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. పోలీసులు బిజెపి నేతలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే బిజెపి తన కార్యకర్తలను ఎలా రక్షించుకోవాలో ఆవిధంగా రక్షించుకునే ప్రయత్నం చేస్తామని వైసీపి ప్రభుత్వాన్ని సోము వీర్రాజు హెచ్చరించారు. బిజెపి నేతలందరినీ బేషరతుగా విడుదల చేయాలన్నారు.
ప్రజాస్వామ్యవ్యవస్ధలో ప్రభుత్వానికి సమస్యలు చెబుతామని, ఆ దిశగానే ముఖ్యమంత్రికి.. ఎమ్మెల్యేల అరచాకాలు తెలియ చేయడానికి వెడితే ఒబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సురేష్ ను పోలీసులు బూటుకాళ్లతో తన్నిన సంఘటన చూస్తే రాష్ట్రంలో పోలీసు పాలన నడుస్తున్నట్లుగా ఉందన్నారు. బిజెపి నేతలను బూటు కాళ్ళతో తన్నిన పోలీసులపై కేసు నమోదు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
This post was last modified on May 12, 2023 9:53 pm
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…