నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా నిండా అవే ఫొటోలు.. వీడియోలు. లెబనాన్ రాజధాని బేరూత్‌లో జరిగిన భారీ పేలుడు తాలూకు దృశ్యాలు విస్తుగొలుపుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 100 మందికిపైగా చనిపోయారని, 4 వేల మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రి వెల్లడించిన తాజా సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు.
అక్కడ జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. కొన్ని కిలోమీటర్ల దూరం భవనాలు కుప్పకూలాయి. చాలా భవనాలు వివిధ స్థాయిల్లో ధ్వంసమయ్యాయి. అనేక రకాల నిర్మాణాలు, వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇంకా అనేక రకాలుగా నష్టం వాటిల్లింది.
ఈ ప్రమాదానికి సంబంధించి వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం. ముందు చిన్న స్థాయిలో పేలుడు జరిగి దట్టమైన పొగ కమ్ముకోవడం కనిపించింది. చాలామంది దాని వీడియోను చిత్రీకరిస్తుంటే.. మరో భారీ పేలుడు సంభవించి కిలోమీటర్ల దూరం మొత్తం నాశనమైంది. ఇలా వీడియోలు తీస్తున్న చాలామంది ప్రమాదానికి గురయ్యారు.
కనీసం పది కిలోమీటర్ల దూరం ఈ పేలుడు ప్రభావం ఉందంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా హిరోషిమా నాగసాకిల మీద ప్రయోగించిన అణుబాంబు ప్రభావంలో నాలుగోవంతు స్థాయిలో ఈ పేలుడు ప్రభావం ఉన్నట్లు నిపుణులు చెబుతుండటం గమనార్హం.
ఇంతకీ ఈ ప్రమాదం ఎందుకు జరిగిందని శోధిస్తున్నారు. బీరట్ పోర్టులో 2750 టన్నుల ప్రమాదకర అమ్మోనియం నైట్రేట్ రసాయనాన్ని ఆరేళ్లుగా ఏ రక్షణా లేకుండా నిల్వ చేసి ఉంచారని.. అదిప్పుడు పేలుడుకు కారణమై పెను విధ్వంసానికి దారి తీసిందని చెబతున్నారు.
This post was last modified on August 6, 2020 10:51 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…