టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 90 రోజులు దాటింది. కొన్ని చోట్ల జనం పలుచగా కనిపిస్తున్నా మెజార్టీ ప్రదేశాల్లో మాత్రం భారీగా తరలి వస్తున్నారు. జనాన్ని చూసి రెచ్చిపోయి లోకేష్ మాట్లాడుతున్నారు. వెళ్లిన ప్రతీ చోట స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడుతున్నారు.
ఈ క్రమంలో పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి పై లోకేష్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైతే సరిపోతుందా.. ప్రజలకు మంచి చేయాలని కదా అని నిలదీశారు. తప్పులు ఎత్తి చూపితే బూతులు తిడుతున్న బూతుల పార్టీ నాయకుడని అన్నారు. ఎమ్మెల్యే కాటసాని అవినీతిని సర్వే నెంబర్లతో సహా బయట పెట్టానని లోకేష్ చెప్పుకున్నారు..
లోకేష్ పాణ్యం నియోజకవర్గం దాటి కర్నూలులో ప్రవేశించే లోపే కాటసాని నోరు విప్పారు. తనదైన శైలిలో సమాధానం చెప్పారు. నారా లోకేష్ జోకర్ కు ఎక్కువ బఫూన్ కు తక్కువ అని కాటసాని అన్నారు. ఇప్పుడా డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లోకేష్ కు దమ్ముంటే తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలన్నారు. లోకేష్ వయసు తన రాజకీయ అనుభవం అంత లేదని కాటసాని గుర్తు చేశారు లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు…
కాటసాని 1980ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీల్లో తిరిగారు. మొత్తం ఎనిమిది సార్లు పోటీ చేస్తే రెండు సార్లు ఓడిపోయి ఆరు సార్లు గెలిచారు. ఆయనకు నోరు ఎక్కువని, పెద్ద రౌడీ అని కూడా పేరుంది. నియోజకవర్గంలో కేబుల్ నెట్ వర్క్ నుంచి ప్రతీదీ ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఆయనపై కేసులు పెట్టేందుకే ప్రత్యర్థులు భయపడతారు. అందుకే 2019 ఎన్నికల అఫిడవిట్ లో క్రిమినల్ కేసులు నిల్ అని రాసి ఉంటుంది. అలాంటి వ్యక్తిపై ఒంటికాలి మీద లేచే సమయంలో ఒకటి రెండు తిట్లు తప్పవని లోకేష్ ఊరుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదేమో…
This post was last modified on May 7, 2023 9:08 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…