నిన్న మొన్నటి వరకు ఉన్న అంచనాలు ఒక్కసారిగా పటాపంచలు అవుతున్నాయా? ఏమో.. హంగ్ వస్తుం దేమో.. ఏమో.. కాంగ్రెస్ అధికారం దక్కించుకుంటుందేమో.. అన్న ముందస్తు సర్వేలు ఇప్పుడు మళ్లీ తెల్ల మొహం వేస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తీరును పరిశీలిస్తున్నవా రు. మరో రెండు రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. నిన్న మొన్నటి వరకు పెద్దగా హడావుడి కనిపించని బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది.
బీజేపీ అగ్రనేత,ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌షాలు రంగంలోకి దిగిపోయారు. అదేసమ యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం ప్రజలకు చేరువయ్యారు. దీంతో నిన్న మొన్నటి వరకు ప్రచారంలో పైచేయిగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు రెండు రోజుల ముందు… కుదేలైన పరిస్థితి కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో భారీ రోడ్ షో నిర్వహించారు. కనీ వినీ ఎరుగని రీతిలో బీజేపీ కార్యకర్తలు జనాలను ఈ షోకు తరలించారు.
అంతేకాదు… ఏకంగా 26 కిలో మీటర్లు సాగిన రోడ్ షోలో రోడ్డుకు ఇరువైపులా నిలబడిన ప్రజలు.. ప్రధానికి అపూర్వ స్వాగతం పలకడం గమనార్హం. మరోవైపు.. అమిత్‌షా కూడా పలు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని.. కాంగ్రెస్‌ను పాయింట్లవారీగా ఏకేస్తున్నారు. ముఖ్యంగా హనుమంతుడి భక్తులను టార్గెట్ చేయడం.. తాజాగా ఎన్నికల్లో కీలక పరిణామంగా మారింది. వీరికి తోడు.. యూపీ సీఎం యోగి కూడా.. ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఆయన కూడా.. కర్ణాటకలోని కొన్ని జిల్లాలను టార్గెట్‌గా చేసుకుని విజృంభిస్తున్నారు. దీంతో అనూహ్యం గా కర్ణాటకలో సమీకరణలు మారుతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం వరకు మాత్రమే సమయం ఉండడంతో.. ఆదివారం, సోమవారం ఈ ప్రచార జోరు మరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే.. నేతలు.. గతంలో మాదిరిగా రియాక్ట్ కాలేక పోతున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న రెండు కీలక విషయాలు.. ఇప్పుడు కాంగ్రెస్‌కు అడ్డంకిగా మారాయి.
This post was last modified on May 8, 2023 6:59 am
ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడైనంత మాత్రాన చట్టాలు పాటించరా? అని…
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సోమవారం ఒకే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమవారం…
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్‌గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో…
అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్ నిన్న సాయంత్రం రానే వచ్చింది. వచ్చీ రాగానే సోషల్…