జగన్ మళ్లీ అధికారానికి రావాలి. ఏదోటి చేసి అధికారాన్ని నిలబెట్టుకోవాలి. దీని కోసం ఇప్పుడాయన కొత్త రూటు వెదుక్కున్నారు. అదే దేవుడ్ని నమ్ముకున్న రూటు. యాగాల రూటు..
ఏపి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 12 నుండి 17 వరకూ నిర్వహిస్తన్న రాజశ్యామల యాగంపై విపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తన్నాయి. ఆ యాగాన్ని రాష్ట్రం పాడిపంటలతో సుభీక్షంగా ఉండేందుకు చేస్తున్నామని చెపుతున్నా… జగన్ తిరిగి సీఎం అయ్యేందుకే ప్రభుత్వ ఖర్చుతో ఈ యాగం చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి.
తాను సీఎం అయ్యేందుకు రాజశ్యామల యాగం చేశానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతో పాటు రెండవ సారి ఎన్నికలకు ముందు ఈ యాగాన్ని తన పామ్ హౌస్ లో నిర్వహించారు. తరువాత ఎన్నికల్లో గెలిచిన ఆయన సహస్ర ఛండీయాగాన్ని సైతం నిర్వహించారు. కేసిఆర్ యాగం చేసిన ప్రతిసారి విజయం సాధిస్తూ రావడంతో ఈ యాగం తెలుగు రాష్ట్రాల్లో ఓ ట్రెండ్ సెట్ గా మారింది. తాజగా ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసిఆర్ అక్కడ కూడా రాజశ్యామల యాగాన్ని శారదా పీఠం, స్వరూపానందేంద్ర పర్యవేక్షణలో పూర్తిచేశారు. దీంతో కేసిఆర్ తరహలోనే సీఎం జగన్ కూడా ఈ యాగాన్ని నిర్వహింపచేస్తే తిరిగి అధికార పీఠం దక్కుతుందని భావించి ఇప్పుడా దిశగా అడుగులు వేస్తున్నారు.
దేవుని సోమ్ము, జనం సోమ్ముతో చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మి మహ యజ్జం చేయాలని జగన్ నిర్ణయించుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రాజశ్యామల యాగానికి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విస్తుత ఏర్పాట్లు చేసేందుకు అన్ని శాఖల కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ యాగానికి రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నారని దానిలో రూ.2.5 కోట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం నుండి వస్తున్నాయని విపక్షాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి తన సొంత డబ్బులతో రాజశ్యామల యాగం చేయిస్తే తప్పులేదని ప్రభుత్వ ధనంతో ఎలా చేయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on May 5, 2023 7:23 am
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…
తీవ్ర వివాదాలు ఎదురుకుంటూ విపరీతమైన వాయిదాలకు లోనవుతూ వచ్చిన ఎమర్జెన్సీ ఇటీవలే విడుదలయ్యింది. క్రిష్ వదిలేశాక మణికర్ణిక బ్యాలన్స్ పూర్తి…
కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. కొవిడ్ టైంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డాక..…