Political News

కొత్త సచివాలయంలోకి ప్రతిపక్ష నేతలను రానివ్వరా?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సెక్రటేరియట్‌లోకి అనుమతించకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అవుటర్ రింగ్ రోడ్డు టెండర్లలో అవకతవకలున్నాయని.. లక్షల కోట్లవిలువైన అవుటర్ రింగ్ రోడ్డును కేటీఆర్, కేసీఆర్ అమ్ముకున్నారని ఆరోపిస్తూ టెండర్ల వివరాలు కోరడానికి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు అడ్డుకుని ఆయన్ను లోనికి వెళ్లకుండా ఆపేయడంతో రేవంత్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు.

అవుటర్ రింగురోడ్డు టెండర్లలో జరిగిన అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వం తనను సెక్రటేరియట్ కు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిన్నటి నుంచే సెక్రటేరియట్ నుంచి పరిపాలన సాగుతుందని అంబేద్కర్ సిద్ధాంతాల గురించి ఉపన్యాసం ఇచ్చిన కేసీఆర్… 24గంటలు తిరగకముందే మరిచారని విమర్శించారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదని, కానీ కేసీఆర్ పాలనలో ఒక ఎంపీగా ఉన్న తనను సెక్రటేరియట్ కు రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడానికి వెళ్తున్నాను అని చెప్పినా పోలీసులు వినలేదన్నారు. ఒక ఎంపీకి ప్రత్యేకంగా అనుమతి ఏమిటని ప్రశ్నించారు. ఎంపీ గా తన కార్డే తనకు అనుమతి అని చెప్పారు.పోలీసులు రోడ్డుపై అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.

అనంతరం అక్కడి నుంచే సెంట్రల్ జోన్ డీసీపీతో ఫోన్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి…. తాను దరఖాస్తు ఇచ్చాకనే తిరిగి వెళతానని భీష్మించుకు కూర్చున్నారు. దాదాపు అరగంట హైడ్రామా అనంతరం పోలీసులు మాసబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలని రేవంత్ రెడ్డికి సూచించారు. దగ్గరుండి మాసబ్ ట్యాంక్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి సెక్షన్ అధికారికి దరఖాస్తును సమర్పించారు రేవంత్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ “ హెచ్ఎండీఏ కార్యాలయం ఇంకా షిఫ్ట్ కాలేదని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇస్తే అక్నాలెడ్జిమెంట్ పై రబ్బరు స్టాంప్ కూడా వేయలేదని, సెక్రటేరియట్ కు షిఫ్ట్ అయ్యిందని సమాధానం ఇచ్చారు. అరవింద్ కుమార్ ఇక్కడ లేడు, అక్కడ లేడు… మరి ఎక్కడ ఉన్నారు? కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా? నయా తెలంగాణ ఈడీ అమీన్ ను సెక్రటేరియట్ లో గొయ్యి తీసి పాతిపెడతారు. లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారు. ఇది వేల కోట్ల కుంభకోణం…. ఈ దోపీడీ వెనక కేటీఆర్, కేసీఆర్ ఉన్నారు. పోలీసులతో రాజ్యాన్ని నడుపుతున్నారు. దీనిపై విచారణ సంస్థలకు పిర్యాదు చేస్తాం.. న్యాయస్థానాల తలుపు తడతాం..కెటీఆర్ ను జైల్లో పెట్టే వరకు పోరాడుతాం.రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదు“ అని రేవంత్ విమర్శించారు.

పరిపాలన భవనంలోకి పార్లమెంటు సభ్యుడికి అనుమతి అవసరం లేదని.. అయినా కిలోమీటర్ దూరంలోనే తనను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు రేవంత్. కనీసం సెక్రటేరియట్ గేటు వద్దనైనా తన దరఖాస్తును తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. కానీ సచివాలయం గేటు వద్దకు కూడా తనను రానివ్వలేదని చెప్పారు. హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ను నిర్మించిందన్నారు. భవిష్యత్ తరాలకు వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలని, అభివృద్ధిని అందించాలని ఓఆర్ఆర్ నిర్మించిందని తెలిపారు.ఇందుకోసం రూ.6696 కోట్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి టోల్ విధానం ప్రభుత్వం తీసుకొచ్చిందని, అందుకే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసి టోల్ వసూలుకు చర్యలు చేపట్టిందన్నారు.

“ప్రతీ ఏటా ప్రభుత్వానికి 750కోట్ల టోల్ ఆదాయం ఉంది. అలాంటి ఆదాయం ఉన్న ఓఆర్ఆర్ ను రూ.7388 కోట్లకు ముంబై సంస్థ ఐఆర్ బీ కి బీఆరెస్ ప్రభుత్వం కట్టబెట్టింది. ఏడాదికి 750కోట్లు వస్తుంటే 246కోట్లకే ముంబై కంపెనీకి కట్టబెట్టింది.బంగారు బాతు ఓఆర్ఆర్ ను కేటీఆర్ 30 ఏళ్లకు తెగనమ్మారు.మూడు నెలల్లో దిగిపోయే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ను అమ్మేసింది. దీనిపై విచారణ సంస్థలకు పిర్యాదు చేస్తాం.. న్యాయస్థానాల తలుపు తడతాం..కెటీఆర్ ను జైల్లో పెట్టే వరకు పోరాడుతాం.బీఆరెస్ ను ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గర్లోనే ఉంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్ల పై విచారణ చేయిస్తాం. ఇందులో ఎవరినీ వదిలే ప్రసక్తి లేద’’ని రేవంత్ అన్నారు.

This post was last modified on May 2, 2023 7:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

టొవినో థామస్ ఇప్పుడెలా స్పందిస్తాడో

మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని,…

8 minutes ago

డెకాయిట్ ఇంకో ఇన్నింగ్స్ ఆడొచ్చు

అడివి శేష్ డెకాయిట్ రెండో వారంలోకి అడుగు పెట్టింది. మిక్స్డ్ టాక్ తోనూ కలెక్షన్లు వచ్చేలా చేసుకోవడం ద్వారా శేష్…

34 minutes ago

బుమ్రా.. ఏమిటీ వైపరీత్యం?

బుమ్రా.. ఈ పేరు చెబితే ప్రత్యర్థి జట్లకు హడల్. తన జట్టుకు ఒక భరోసా. ఆడుతోంది ఎక్కడైనా కానీ.. పిచ్…

40 minutes ago

నాగశౌర్య అందుకే హడావిడి చేయలేదు

ఇవాళ రిలీజైన కొత్త సినిమాల్లో అందరి దృష్టి తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ మీద ఉంది కానీ బ్యాడ్ బాయ్…

1 hour ago

ఆటలో ఆ పాత కసి ఏది? స్టార్ ప్లేయర్లపై ఫ్యాన్స్ ఫైర్!

ఐపీఎల్ 2026లో చాలా మంది ప్లేయర్స్ సరిగ్గా ఆడటం లేదు, కానీ అందరి కళ్లు మాత్రం పంత్, రుతురాజ్, సూర్య…

2 hours ago

విజయ్… కొంతయినా జాలి కలిగేనా?

దళపతి విజయ్ ఇప్పుడు అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నాడు. ఒకవైపు 30 ఏళ్ల సినీ కెరీర్‌ను వదిలేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి…

3 hours ago