టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి గత ఏడాది హీరోగా అరంగేట్రం చేశాడు ఆశిష్. అతడి తొలి చిత్రం రౌడీ బాయ్స్ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. హుషారు ఫేమ్ హర్ష రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి టైంలో ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది.
ఐతే ఈ సినిమా హిట్టో ఫ్లాపో ఆ టైంలో తనకే అర్థం కాని పరిస్థితి తలెత్తిందని రాజు ఇప్పుడు వ్యాఖ్యానించడం విశేషం. ఆశిష్ రెండో సినిమా సెల్ఫిష్ నుంచి ఒక పాటను లాంచ్ చేసిన సందర్భంగా రౌడీ బాయ్స్ గురించి రాజు మాట్లాడాడు.
రౌడీ బాయ్స్ రిలీజైనపుడు రెస్పాన్స్ చూసి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాలేదు. కొందరేమో సినిమా బాగుందన్నారు. కొందరు డిఫరెంట్‌గా మాట్లాడారు. మా అబ్బాయి కాబట్టి బాగా ప్రమోట్ చేసి ఆడించారని అన్నారు. ఐతే ఏ సినిమాకైనా ఎంత రెవెన్యూ వచ్చిందన్నది ముఖ్యం. ఒక కొత్త హీరో స్థాయికి తగ్గట్లు ఆ సినిమా వసూళ్లు రాబట్టింది. ఆశిష్ కొత్త హీరోలా కాకుండా అనుభవం ఉన్న నటుడిలా చేశాడని ప్రేక్షకులు ప్రశంసించారు అని దిల్ రాజు అన్నాడు.
దిల్ రాజు అయితే ఏంటి.. డాష్ డాష్ అయితే ఏంటి అని కొంతమంది రెడీ ఉంటారని.. కాబట్టి కష్టపడాలని ఆశిష్‌ను ఉద్దేశించి రాజు వ్యాఖ్యానించడం విశేషం. సుకుమార్ శిష్యుడైన కాశి దర్శకత్వంలో ఆశిష్ రెండో సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సుకుమార్ నిర్మాణ భాగస్వామి కూడా. ఆశిష్ తొలి సినిమాను మించి ఉండాలని.. ఒక మంచి కథతో ఈ సినిమా చేస్తున్నామని.. సుకుమార్‌తో 19 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం కలిశామని రాజు తెలిపాడు. సెల్ఫిష్ చిత్రానికి మిక్కీ జే మేయర్, అనూప్ రూబెన్స్‌లతో పాటు మరో సంగీత దర్శకుడు కూడా పని చేస్తున్నాడని.. ఇలా బాలీవుడ్ కల్చర్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నామని రాజు చెప్పాడు.
This post was last modified on May 2, 2023 7:04 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…