కరోనా పుణ్యమా అని యావత్ ప్రపంచం మొత్తం సరికొత్త పరిస్థితుల్లో ఉందని చెప్పాలి. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరూ సంతోషంగా లేని పరిస్థితి. కడుపు నిండా పట్టెడన్నం లేక పేదోడి వేదన చెందుతుంటే.. తినేందుకు.. ఉండేందుకు చచ్చేంత ఉన్నా.. కరోనా భయం సంపన్నుడ్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏకకాలంలో రాజు.. పేద అన్న తేడా లేకుండా అందరిని వణికిస్తున్న క్రెడిట్ మాత్రం కరోనాకే చెల్లుతుంది.
విరుచుకుపడుతున్న మహమ్మారి వైరస్ వేళ.. అందరిలోనూ కరోనా భయంతో పాటు.. దాని కారణంగా చోటు చేసుకుంటున్న సామాజిక మార్పుల్లో తమ మీద పడే ప్రభావం ఎంతన్న లెక్కల్లో ప్రతి ఒక్కరూ మునిగిపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దుబాయ్ లోని ఒక భారతీయుడికి అదృష్టం వరించింది. అతగాడి సుడి తిరిగిపోయేలా లాటరీ తగిలింది.
సంక్షోభంలో అతగాడి అదృష్టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దుబాయ్ లోని ఎమిరేట్స్ లోటో ప్రారంభోత్సవ డ్రాలో ఒక భారతీయుడు విజేతగా నిలిచారు. మన రూపాయిల్లో చూస్తే రూ.73 లక్షల భారీ మొత్తాన్ని ప్రైజ్ మనీగా గెలుచుకున్నారు. తన దగ్గరున్న టికెట్లోని ఆరు నెంబర్లు కలవటంతో తాను షాక్ తిన్నట్లుగా మహమ్మద్ ఖలీద్ చెబుతున్నారు.
దుబాయ్ లో టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ గా పని చేస్తున్న అతగాడు పదేళ్ల క్రితం భారత్ నుంచి దుబాయ్ వెళ్లారు. తాజాగా అతడికి లాటరీ వరింటంతో భారీ ప్రైజ్ మనీతో పాటు.. కరోనా వేళ మహా సుడిగాడన్న పేరును సొంతం చేసుకున్నాడు. తనకొచ్చిన లాటరీ మొత్తాన్ని తన కుటుంబానికి పంచటంతో పాటు.. యూఏఈ వైస్ ప్రెసిడెంట్.. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు 10 మిలియన్ రమదాన్ మీల్స్ కార్యక్రమానికి తన వంతు సాయాన్ని అందిస్తానని చెప్పి తన పెద్ద మనసును చాటుకున్నాడు.
This post was last modified on April 23, 2020 11:03 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…