Political News

చంద్రబాబు చెప్పినా పర్సు తీయరు.. ఖర్చు చేయరు..

జగన్ పాలనకు ముగింపు పలికి ఎలాగైనా అధికారంలోకి వస్తామని టీడీపీ రోజురోజుకీ తన నమ్మకం పెంచుకుంటున్నా కొన్ని నియోజకవర్గాలలో నాయకులు మాత్రం వెనుకడుగు వేస్తున్నారట. దానికి కారణం వారు తమకు టికెట్ వస్తుందని నమ్మకపోవడమేనట.. ముఖ్యంగా జనసేన, టీడీపీ పొత్తు ఉంటే తమ సీటు జనసేనకు ఇస్తారన్న అనుమానాలున్న నియోజకవర్గాలలోని టీడీపీ నేతలు యాక్టివ్‌గా తిరగడం లేదని చెప్తున్నారు.

టికెట్ వస్తుందో రాదోనని.. జనసేనకు పట్టున్న నియోజకవర్గాల్లో ఇన్చార్జులు డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సీటు రాదనే అనుమానంతో ఖర్చుకు వెనుకంజ వేస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇన్చార్జులు సీటు దక్కుతుందో లేదోనన్న అనుమానంతో ఉన్నారని.. ఈ కారణంగానే వారు యాక్టివ్‌గా లేరని చెప్తున్నారు. ఇలా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంలో ఇబ్బందులు నెలకొన్నాయి.

కాగా ఈ విషయం పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికీ చేరింది. దీంతో ఏ ఏ నియోజకవర్గంలో కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదనే దానిపై దృష్టి పెట్టారు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీకి విజయావకాశాలున్నాయనే సంకేతాలను పంపుతున్నారు. అధికార వైసీపీకి దీటుగా నిరంతరం ప్రజల్లో ఉండేట్లు కసరత్తు చేస్తున్నారు. అంతేకాదు.. పొత్తులతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ పొత్తు కుదిరి కలిసి పోటీ చేసినా కూడా జనసేనకు టీడీపీ ఓటింగ్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలని.. అందుకోసం కూడా ఇప్పటి నుంచి జనాన్ని టీడీపీ వైపు ఆకర్షించాలని చంద్రబాబు సూచిస్తున్నారు.

చంద్రబాబు నుంచి సూచనలు వస్తున్నప్పటికీ జనసేనకు ఇస్తారనే అనుమానం ఉన్న నియోజకవర్గాలలోని టీడీపీ నేతలు మాత్రం డబ్బులు ఖర్చు చేయడం లేదు. దీంతో రాష్ట్ట్రమంతా టీడీపీలో ఉత్సాహం కనిపిస్తున్నా ఆయా నియోజకవర్గాలలో మాత్రం నీరసం కనిపిస్తోంది. మరి.. చంద్రబాబు పొత్తుల సంగతి తొందరగా తేలుస్తారా.. లేదంటే, చేజేతులా అవకాశాలు వదులుకుంటారో చూడాలి.

This post was last modified on April 27, 2023 7:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

6 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

7 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

7 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

8 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

9 hours ago