పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారా ? కాంగ్రెస్ కు రాజీనామా చేసి తొందరలోనే తెలుగుదేశంపార్టీలో చేరబోతున్నారా ? పార్టీ సీనియర్ నేత జేసీ దివాకరరెడ్డి బుధవారం సాకే ఇంటికి వెళ్ళారు. వీళ్ళభేటీలో సాకేను టీడీపీలో చేరమని జేసీ ఆహ్వానించినట్లు సమాచారం. శింగనమల నియోజకవర్గంలో పార్టీ బలమైన అభ్యర్ధికోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలోనే పీసీసీ అధ్యక్షుడిగాను అంతకుముందు మంత్రిగా కూడా పనిచేసిన శైలజానాధ్ ను టీడీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలైనట్లు ప్రచారం మొదలైంది.
శైలజానాధ్ అయితే పార్టీ తరపున అన్నీ విధాలుగా గట్టి అభ్యర్ధి అవుతారని జేసీ ఇప్పటికే చంద్రబాబునాయుడుతో చెప్పారట. ఇపుడు నియోజకవర్గంలో చాలా గ్రూపులున్నాయి. వీటిల్లో ఏ ఒక్క గ్రూపుకు మరో గ్రూపుతో పడటంలేదు. పోయిన ఎన్నికల్లో పోటీచేసిన బండారు శ్రావణి మీద వైసీపీ తరపున పోటీచేసిన జొన్నలగడ్డ పద్మావతి గెలిచారు. గెలిచిన పద్మావతి, ఓడిన బండారు ఇద్దరు నియోజకవర్గంలో యాక్టివ్ గానే తిరుగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో శ్రావణి రెగ్యులర్ గా పాల్గొనటమే కాకుండా క్యాడర్ తో కూడా టచ్ లో ఉంటున్నారు.
అయితే శ్రావణి భర్త డామినేషన్ కారణంగానే నియోజకవర్గంలో కొందరు నేతలతో గొడవలవుతున్నాయట. అందుకనే శ్రావణికి వ్యతిరేకంగా మూడు గ్రూపులు తయారయ్యాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ఎవరికి వారుగా తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ కారణంగానే శ్రావణి మీద కూడా పార్టీలో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది.
ఈ గ్రూపులన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఎవరో ఒకళ్ళకి టికెటిచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని అర్ధమైపోయింది. అందుకనే బలమైన అభ్యర్ధికోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే జేసీ హఠాత్తుగా శైలజ ఇంటికి వెళ్ళింది. సాకేకు కూడా కాంగ్రెస్ లో ఇక భవిష్యత్తు లేదని అర్ధమైపోయింది. అందుకనే వైసీపీలో చేరుతారని ఒకసారి లేదు లేదు టీడీపీలో చేరబోతున్నారని మరోసారి ప్రచారం జరుగుతోంది. ఇపుడు సడెన్ డెవలప్మెంట్ కారణంగా టీడీపీలో చేరటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజంగానే శైలజ టీడీపీలో చేరి పోటీచేస్తే ఇప్పటికే ఉన్న గ్రూపులన్నీ ఏకమై వ్యతిరేకం చేస్తే అప్పుడు ఏమవుతుంది ?
This post was last modified on April 27, 2023 12:35 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…