Political News

విచారణలో ముగ్గురినీ కలుపుతారా ?

వివేకానందరెడ్డి హత్యకేసులో ముగ్గురిని కలిపి విచారించేందుకు సీబీఐ రెడీ అవుతోందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అరెస్టయిన డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డిని ఐదురోజుల పాటు సీబీఐ కస్టడీకి హైకోర్టు అనుమతించింది. తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని 25వ తేదీవరకు అరెస్టు చేయద్దని సీబీఐని ఆదేశించిన హైకోర్టు విచారణలో సహకరించాలని ఎంపీకి చెప్పింది.

బుధవారం అవినాష్ ను సీబీఐ ప్రశ్నించబోతోంది. అందుకనే తమ ఆఫీసుకు రమ్మని నోటీసిచ్చింది. ఎలాగూ అవినాష్ వస్తారు కాబట్టి ఇదే సమయానికి డాక్టర్ ఉదయ్, భాస్కర్ ను కూడా ఆఫీసుకు తీసుకొచ్చే అవకాశముందని సమాచారం. జైల్లోనే వీళ్ళిద్దరిని విచారించేట్లయితే తమ కస్టడీకి ఇవ్వాలని హైకోర్టును సీబీఐ అడగాల్సిన అవసరంలేదు. అయినా అడిగిందంటే ఉద్దేశ్యం ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతోంది. భాస్కర్ రెడ్డి ఎంపీకి తండ్రి అయితే డాక్టర్ అత్యంత సన్నిహితుడు.

అందుకనే ముగ్గురిని కలిపి విచారిస్తేనే చాలా విషయాలు బయటకు వస్తాయని సీబీఐ అనుకుంటోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంపీ విషయంలో సీబీఐ ప్రధానంగా ఆధారపడింది గుగుల్ టేకౌట్ సాంకేతికత మీదనే. అయితే దాన్ని ప్రామాణికంగా తీసుకునేందుకు లేదని హైకోర్టు తేల్చి చెప్పేసింది. ఎంపీ ప్రజాప్రతినిధి కాబట్టి ప్రతిరోజు ఎంతోమంది ఎంపీ దగ్గరకు వచ్చి వెళుతుంటారు. ఎక్కడైనా నేరం చేసిన వాళ్ళు ఎంపీ ఇంటికి వచ్చి వెళ్ళినంత మాత్రాన ఎంపీకి కూడా నేరంలో భాగస్వామ్యముందని ఎలా చెప్పగలరన్న హైకోర్టు ప్రశ్నకు సీబీఐ లాయర్ సమాధానం చెప్పలేకపోయారు.

గుగుల్ టేకౌట్ ద్వారా మొబైల్ ఫోన్ మూమెంట్ ఏ రోజు ఏ గంటలో ఎక్కడుందో చెప్పచ్చేకానీ జరిగిన నేరంతో ఎవరెవరికి సంబంధాలున్నాయో చెప్పే అవకాశంలేదని కోర్టు చెప్పింది. దాంతో సీబీఐ లాయర్ కు ఏమిమాట్లాడాలో దిక్కుతోచలేదు. కాబట్టి గుగుల్ టేకౌట్ ఒక్కదాన్నే ఆధారంగా చేసుకుని ఎంపీని దోషిగా తేల్చాలంటే అది జరిగేపనికాదని తేలిపోయింది. కాంక్రీట్ ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అన్న కోర్టు ప్రశ్నకు లాయర్ సమాధానం చెప్పలేకపోయారు. అందుకనే కోర్టు ఎంపీకి ముందస్తు బెయిల్ ఇచ్చింది. మరి తాజా విచారణలో సీబీఐ ఎలాంటి సాక్ష్యాలు సేకరిస్తుందో చూడాలి.

This post was last modified on April 19, 2023 2:12 pm

Share

Recent Posts

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

4 minutes ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

25 minutes ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

47 minutes ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

3 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

3 hours ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

3 hours ago